Rashmika Mandanna: మహేష్ సినిమా మర్చిపోయి అడ్డంగా దొరికిన రష్మిక.. వారికి సారీ చెప్పిన శ్రీవల్లి..

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ మూవీస్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కానీ తాజాగా మహేష్ బాబు సినిమాను మర్చిపోయి ట్రోలర్లకు అడ్డంగా దొరికిపోయింది. ఇంకేముంది ట్విట్టర్ ఖాతాలో రష్మికను ట్రోల్ చేస్తున్నారు.

Rashmika Mandanna: మహేష్ సినిమా మర్చిపోయి అడ్డంగా దొరికిన రష్మిక.. వారికి సారీ చెప్పిన శ్రీవల్లి..
Rashmika, Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2024 | 10:51 AM

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమా హిట్ తెగ ఎంజాయ్ చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మికకు ఇప్పుడు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు మహేష్ అభిమానులకు సారీ చెప్పింది. అసలు విషయానికి వస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా విజయ్ దళపతి నటించిన గిల్లి అని తెలిపింది. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీకి రీమేక్ అని తనకు ఈ మధ్యే తెలిసిందని.. అందులోని అప్పుడి పోడి సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తన లైఫ్ మొత్తంలో ఆ పాటకు ఎన్నోసార్లు స్టేజ్ మీద డ్యాన్స్ చేసినట్లు తెలిపింది. తాను స్క్రీన్ మీద చూసిన మొదటి హీరో విజయ్ అని.. ఫస్ట్ హీరోయిన్ త్రిష అని చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.. ఇక్కడ రష్మిక చెప్పిన మహేష్ బాబు సినిమా పేరు పొరపాటుగా మారింది.

ఇవి కూడా చదవండి

గిల్లి సినిమా మహేశ్ నటించిన ఒక్కడు మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు. కానీ రష్మిక పోకిరి రీమేక్ అని చెప్పడంతో ఆమెను సరదాగా ఆట పట్టిస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా అలాంటి ఓ పోస్టుకు రష్మిక తెలుగులో రిప్లై ఇస్తూ.. “అవును.. సారీ గిల్లి సినిమా ఒక్కడు రీమేక్ కదా.. అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నాను.. పోకిరిని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ చేస్తారు అనుకున్నా.. నిజంగా సారీ..నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే” అంటూ ఫన్నీ ఎమోజీలను షేర్ చేసింది.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.