Keerthy Suresh: బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. తొలి సినిమా రెమ్యునరేషన్ ఎంతంటే?
వరుణ్ ధవన్ హీరోగా తెరకెక్కిన బేబీ జాన్ చిత్రంతో సౌత్ హీరోయిన్ కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం క్రిస్మస్కు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కీర్తి తీసుకుంటున్న రెమ్యునరేషన్పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత వారం మ్యారేజ్ చేసుసుకున్న కీర్తి సురేష్.. వెంటనే బేబీ జాన్ మూవీ ప్రమోషనల్స్ మొదలుపెట్టేశారు.
ఇటీవలే పెండ్లిపీటలు ఎక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్ ‘బేబీ జాన్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. క్రిస్మస్కు రిలీజ్ కాబోయే ఈ సినిమాలో వరుణ్ ధవన్ హీరో. ఈ క్రమంలోనే తన తొలి చిత్రానికి కీర్తి సురేశ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వివరాలు బయటికి వచ్చాయి. ఇప్పటివరకు కీర్తి సురేశ్ దక్షిణాదికే పరిమితమైంది. ఆమె నటించిన చిత్రాలు సైతం పెద్దగా హిందీలో రిలీజ్ కాలేదు. దీంతో బేబీ జాన్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు కీర్తి సిద్ధమవుతోంది.
పెళ్లి బిజీలోనూ ప్రమోషన్లు..
కీర్తి సురేశ్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెండ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మూవీ ప్రమోషన్లలో కీర్తి చురుకుగా పాల్గొంది. దక్షిణాదిలో కీర్తి సురేశ్ చాలా సినిమాలు చేసినప్పటికీ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్న విషయంపై అంతగా వివరాలు లేవు. బేబీ జాన్‌కు సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు గాను కీర్తి రూ.4 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా గత వారం మ్యారేజ్ చేసుకున్న కీర్తి.. వెంటనే మూవీ వర్క్ మొదలుపెట్టేసింది. బేబీ జాన్ మూవీ ప్రమోషన్‌లో బిజీ అయిపోయారు. కీర్తి సురేష్ ప్రొఫషనల్ కమిట్‌మెంట్ బేష్ అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి అభినందనలు అందుకుంటున్నారు.
బేబీ జాన్ మూవీ ప్రమోషన్‌లో కీర్తి సురేష్
View this post on Instagram
అట్లీ- విజయ్ ‘తేరీ’ రీమేక్
గతంలో కోలివుడ్ డైరెక్టర్ అట్లీ, దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్ సినిమానే ‘బేబీ జాన్’. ఈ చిత్రానికి అట్లీ సహా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. కాగా, ఇప్పటికే విడుదలైన బేబీ జాన్ ట్రయలర్తో పాటు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నైన్ మటాకా అనే పాటలో కీర్తి తన అందాల ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేసింది.