Copra MSP: కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

Agriculture News: కొబ్బరి పంటసాగు వ్యయం గత కొంతకాలంగా గణనీయంగా పెరిగింది. అటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో కొబ్బరికి, కొబ్బరినూనెకు డిమాండు కూడా పెరిగింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చేసిన సిఫార్సులకు ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు.

Copra MSP: కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
Copra MSP
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 21, 2024 | 12:42 PM

Good News for Farmers: కొత్త సంవత్సరాది వేళ కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొబ్బరి రైతులకు మేలు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌కు సంబంధించి కొబ్బరి కనీస మద్దతు ధర (Copra MSP)ను పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మిల్లింగ్‌ కొబ్బరి ధర క్వింటా రూ.11,582గా, బాల్ కొబ్బరి ధరను రూ.12,100గా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు పెంచిన కొబ్బరి కనీస మద్దతు ధరకు ఆమోదముద్ర వేసింది. 2024తో పోలిస్తే 2025 సీజన్‌లో మిల్లింగ్‌ కొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.422 పెంచారు. అలాగే బాల్ కొబ్బరి కనీస మద్దతు ధర రూ.100 మేర పెంచారు.

పెరిగిన కొబ్బరి పంటసాగు వ్యయంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో కొబ్బరికి, కొబ్బరినూనెకు ఉన్న డిమాండు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. కొబ్బరి రైతులకు రాబడి పెంచేందుకు, కొబ్బరి సాగుబడిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం దోహపడే అవకాశముంది.

కొబ్బరి కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం..

మరీ ముఖ్యంగా కొబ్బరి సాగుబడి ఎక్కువగా ఉండే కేరళ సహా దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లోని కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎక్కువ ప్రయోజనం చేకూర్చనుంది. సాగుబడి వ్యయం పెరిగిన నేపథ్యంలో కనీస మద్దతు ధరను పెంచాలని ఈ రాష్ట్రాల్లోని రైతులు గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ మేరకు ఇప్పుడు కనీస మద్దతు ధరను పెంచడం పట్ల కొబ్బరి రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.