Viral Video: ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త..!
దాదాపు అన్ని కేసుల్లోనూ గొడవలు, అల్లర్లు, పోలీస్ కేసులతో హంగామా సృష్టిస్తున్నాయి. అయితే, అలాంటి ఓ కేసులో ఎవరూ ఊహించని విధంగా, విచిత్రమైన ఉదంతం వెలుగు చూసింది. భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలియడంతో భర్తే స్వయంగా ఆమె ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించాడు. ఈ పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కేసులు ఎక్కువగా వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ అనైతిక సంబంధాలు ఎన్నో కుటుంబాలను నాశనం చేశాయి. ముఖ్యంగా భర్తకు వేరొకరితో సంబంధం ఉందని భార్యకు తెలిసినా, భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిస్తే పెద్ద గొడవే అవుతుంది. దాదాపు అన్ని కేసుల్లోనూ గొడవలు, అల్లర్లు, పోలీస్ కేసులతో హంగామా సృష్టిస్తున్నాయి. అయితే, అలాంటి ఓ కేసులో ఎవరూ ఊహించని విధంగా, విచిత్రమైన ఉదంతం వెలుగు చూసింది. భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలియడంతో భర్తే స్వయంగా ఆమె ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించాడు. ఈ పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముగ్గురు పిల్లల తల్లి ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ఈ వింత ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అయితే, అప్పటికే ఆ మహిళ, ఆమె భర్త 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె మరో వ్యక్తి ప్రేమలో పడింది. భార్య ఆనందానికి భంగం కలగకూడదని భావించిన ఆ భర్త ఆమె ప్రేమించిన వ్యక్తితో మరో పెళ్లి జరిపించాడు. ఘర్కేకలేష్ అనే X ఖాతాలో వీడియో షేర్ చేయబడింది.
Extra-Marital Affair (Mother of three children fell in love with the father of two children, the husband got his wife married to her boyfriend; they had love marriage 12 years ago) Saharsa Bihar pic.twitter.com/0QV5Trw8PS
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024
వైరల్ అవుతున్న వీడియోలో భర్త తన భార్యకు రెండో పెళ్లి చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. పట్టణ ప్రజల ఎదుటే సదరు వ్యక్తి మహిళ నుదుటిపై సింధూరం పోసి పెళ్లి చేసుకున్నాడు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అది తనదే బాధ్యత అని, అన్ని నువ్వే ఎదుర్కోవాల్సి ఉంటుందని మొదటి భర్త చెప్పాడు. డిసెంబర్ 19న షేర్ చేయబడిన ఈ వీడియోకు 5.4 మిలియన్ల వ్యూస్, అనేక కామెంట్లు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..