రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం.. చిన్నబోయిన తాజ్‌మహల్‌..!!

భారతదేశంలో అయోధ్య ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారింది. అయోధ్య రామమందిరం ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఆ అందాల బాలరాముడి ముందు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్‌మహల్‌ కూడా చిన్నబోయిందా అనిపించేలా అందిరి దృష్టిని ఆకర్షించింది. 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 47.61 కోట్ల మంది

రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం.. చిన్నబోయిన తాజ్‌మహల్‌..!!
Ayodhya
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 21, 2024 | 12:50 PM

అయోధ్య రామమందిరం.. ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా ఆలయం ప్రారంభమైంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ఆలయాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు, సందర్శకులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. దేశ విదేశాల నుంచి విచ్చేస్తున్న భక్తులతో అయోధ్య ప్రతినిత్యం రద్దీగా మారింది. అయోధ్య రామమందిరం ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఆ అందాల బాలరాముడి ముందు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్‌మహల్‌ కూడా చిన్నబోయిందా అనిపించేలా అందిరి దృష్టిని ఆకర్షించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామమందిరం సరికొత్త పర్యాటక రికార్డులను సృష్టించింది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య నిలిచింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్.. భారత్‌లోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని అయోధ్య భర్తి చేసింది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర పర్యాటక పరిశ్రమకు కొత్త మైలురాళ్లను నెలకొల్పింది.

2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు సందర్శించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది.. వీరితోపాటు 3153 మంది విదేశీ పర్యాటకులు కూడా అయోధ్యను సందర్శించారని చెప్పారు. అదే సమయంలో ఆగ్రాలో ఉన్న తాజ్‌ మహల్‌ను మొత్తం దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది. కేవలం 9 నెలల్లోనే తాజ్‌ మహల్ రికార్డ్‌ను అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి..
ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి..