చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శీతాకాలంలో చలి గాలుల నుంచి రక్షణ పొందాలంటే వెచ్చటి బట్టలు వేసుకుంటే సరిపోదు, ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చలికాలంలో జలుబు, దగ్గు తదితర వ్యాధులు ఎక్కువగా వేధిస్తుంటాయి.. ఈ సీజన్‌లో ఫిట్‌గా ఉండాలంటే, శరీరంలో వెచ్చదనాన్ని కాపాడే, సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇందులో భాగంగా చలికాలంలో మీరు ఆహారంలో నెయ్యిని చేర్చుకోవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవును, ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Desi Ghee
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 21, 2024 | 10:19 AM

చలికాలంలో నెయ్యిని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చలికాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నెయ్యి చర్మానికి తేమని అందిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం పొడిబారి పోవడం, దురదలు, ర్యాషెస్ వంటి సమస్యలు ఉండవు. చలికాలంలో నెయ్యిని తీసుకోవడం వల్ల బాడీ వెచ్చగా మారుతుంది. దీంతో చలిని తట్టుకోగల శక్తి సమకూరుతుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న మలినాలు బయటకు వెళ్లిపోతాయి. బాడీ క్లీన్ అవుతుంది. తద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

నెయ్యి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో నెయ్యిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయినా విటమిన్ A, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం.  చపాతీపై నెయ్యిని వేసి తీసుకోవచ్చు. అయితే ఎంత నెయ్యి వేసుకుంటున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి.

వంట చేసేటప్పుడు రిఫైండ్ ఆయిల్‌కి బదులుగా నెయ్యిని ఉపయోగించడం వల్ల హెల్తీగా ఉండొచ్చు. నెయ్యిని ఇలా కూడా ఈజీగా డైట్‌లో చేర్చుకోవచ్చు. పప్పు తీసుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. పిల్లలకు కూడా పప్పు అన్నంలో నెయ్యి వేసి తినిపించటం అలవాటుగా చేయాలంటున్నారు నిపుణులు. నెయ్యిని తినడం వల్ల స్త్రీలకు రుతుస్రావ సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

అలాగే, చాలామంది టీ లేదా కాఫీలో కూడా నెయ్యి వేసుకుంటున్నారు. ఇలా తీసుకోవటం కూడా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. అయితే, కేవలం రోజుకి మూడు టీ స్పూన్ల వరకు మాత్రమే వేసుకోవాలని చెబుతున్నారు.. దానికి మించి వేసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)