Horse Gram Benefits: ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పుష్కలమైన పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో తెల్లవి, నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలు ఉలవలతో పుష్కలంగా లభిస్తాయి. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారినికి సమానమైన ప్రోటీన్‌ కూడా లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ ఉలవలు తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Dec 21, 2024 | 8:43 AM

ఉలవలు తరచూ తీసుకోవటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఉలవల్లోని ఫైబర్‌ రక్తంలోగుండె ఆరోగ్యానికి మంచిది, చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. ఉలవలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.  వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి.

1 / 5
ఉలవలతో మహిళల్లో ఎదురయ్యే రుతుక్రమ రుగ్మతలు, ల్యుకోరియా చికిత్సకు సాయపడుతుంది. అలాగే, అతి మూత్ర  వ్యాధికి  చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును రక్షిస్తుంది.

2 / 5
ఉలవలు తినటం వల్ల ఎముకలను బలోపేతం చేస్తుంది. రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.  కాలేయ పనితీరును రక్షిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉలవల పాలను పిల్లలకు పోషక ఆహారంగా కూడా పెడుతుంటారు.

3 / 5
అలాగే, శీతాకాలంలో వచ్చే కఫ దోష సమస్యలు తగ్గించడంలో కూడా ఉలవలు అద్భుత మేలు చేస్తాయి. ఆకలిలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఉలవలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

4 / 5
ఉల‌వ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో వచ్చే రాళ్లు సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్‌ లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం, గ్యాస్  వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 5
Follow us