IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?

IPL 2025 Starting Date: ఇండియన్ రిచ్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు మహిళల ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్-18 కూడా ప్రారంభం కానుంది.

Venkata Chari

|

Updated on: Dec 21, 2024 | 11:31 AM

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 ప్రారంభ తేదీ నిర్ణయించారు. మార్చి 14 నుంచి ఇండియన్ రిచ్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ మే చివరి వారంలో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

1 / 5
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుందని బీసీసీఐ వర్గాల సమాచారం. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోకపోతే, ఈ తేదీలో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

2 / 5
ఎందుకంటే, జూన్ 11 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ టోర్నీని రెండు వారాల ముందుగానే పూర్తి చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. కానీ, భారత జట్టు ఫైనల్ చేరకపోతే మే నెలాఖరు వరకు ఐపీఎల్ టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది.

3 / 5
మార్చి 14న జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడే అవకాశం ఉంది. దీంతో ఈసారి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఓపెనింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

4 / 5
ఐపీఎల్ ప్రారంభానికి ముందు మహిళల ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై మార్చి 9న ముగుస్తుంది. దీంతో డబ్ల్యూపీఎల్, ఐపీఎల్ మధ్య వారం రోజుల గ్యాప్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం, ఫిబ్రవరి నెల నుంచి భారతదేశంలో టీ20 పండుగ ప్రారంభమవుతుంది. మే చివరి వరకు, క్రికెట్ ప్రేమికులకు వినోదం లభిస్తుంది.

5 / 5
Follow us