- Telugu News Photo Gallery Placing these in bedroom increases distance between the couple, Check Here is Details
Vastu Tips: బెడ్ రూమ్‌లో వీటిని పెడితే.. దంపతుల మధ్య దూరం పెరుగుతుందట..
ప్రతీ ఒక్కరి ఇంట్లో బెడ్ రూమ్ అనేది కామన్‌గా ఉంటుంది. బెడ్ రూమ్‌ని వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే నిద్ర చక్కగా పడుతుంది. నెగిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు ఉండటం వల్ల కూడా నిద్ర సమస్యలు, దంపతుల మధ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని దూరంగా ఉంచుకోవాలి..
Updated on: Dec 21, 2024 | 1:52 PM

వాస్తు అనేది ఇంట్లోని అన్నింటికీ వర్తిస్తుంది. ముఖ్యంగా వాస్తు ప్రకారం బెడ్ రూమ్‌లో కొన్నింటిని పెట్టకపోవడం మంచిది. వీటిని ఉంచడం వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరుగుతుంది. ఆ గదిలో నెగిటివిటీ పెరిగి గొడవలు జరుగుతాయి.

ఇలా బెడ్ రూమ్‌లో ఉంచకూడని వస్తువుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకటి. టీవీ, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ వంటి వాటిని బెడ్ రూమ్‌లో ఉంచుకోకూడదు వీటి వలన రేడియేషన్ పెరుగుతుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉన్నట్లయితే వీటిని ఓ గంట ముందే ఆఫ్ చేయాలి.

అలాగే బెడ్ రూమ్‌లో పదునైన వస్తువులు కూడా ఉంచకూడదు. చాకు, కత్తెరలు వంటివి బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు. వీటి వలన నెగిటివ్ ఎనర్జీ పెరిగి.. దంపతుల మధ్య గొడవలకు కారణం అవుతాయి.

ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే.. ఎరుపు రంగు ఉండే వస్తువులను మీకు ఎదురుగా ఉంచుకోకూడదు. దీని వలన కూడా నిద్రభంగం కలుగుతుంది. అలాగే బెడ్ రూమ్‌ని ఎప్పుడూ ప్రశాంతంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

బిల్లులు కూడా బెడ్‌రూమ్ పెట్టకూడదు. అద్దాలు కూడా నిద్రించే ముందు నేరుగా కనిపించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే కవర్ చేయాలి. పాజిటివ్ ఎనర్జీని పెంచే, ఆనందంగా ఉంచే వస్తువుల్ని మాత్రమే మీ బెడ్ రూమ్‌లో ఉంచుకోండి.





























