- Telugu News Photo Gallery These are the foods that reduce any depression, Check Here is Details in Telugu
Foods for Depression: ఎంతటి డిప్రెషన్ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..
ఈ మధ్య కాలంలో సాధారణ సమస్యలా మారిన వ్యాధుల్లో డిప్రెషన్ కూడా ఒకటి. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే చాలా సమయం పడుతుంది. డిప్రెషన్‌ను తగ్గించే ఆహారాలు కూడా చాలానే ఉన్నాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది..
Updated on: Dec 21, 2024 | 1:27 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో డిప్రెషన్ కూడా ఒకటి. డిప్రెషన్‌లోకి వెళ్లారంటే.. ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలని పిస్తుంది. ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా అందరూ ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు.

ఒత్తిడి, ఆందోళనను మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. డిప్రెషన్ నుంచి బయట పడటానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయి. ఎంతో మందిని డిప్రెషన్ నుంచి బయట ప్డడారు కూడా. కొన్ని రకాల ఆహారాలు డిప్రెషన్‌ను తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తాయి.

కోడిగుడ్డు, కొన్ని రకాల ఆయిల్స్, పుట్టగొడుగులు వంటి వాటిని తరచూ తీసుకుంటే డిప్రెషన్ నుంచి త్వరగా బయట పడొచ్చు. విటమిన్ డి ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. సూర్య రశ్మి నుంచి కూడా నేరుగా విటమిన్ డి అందుతోంది.

విటమిన్ డి తీసుకోవడం వల్ల శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది డిప్రెషన్ రాకుండా అడ్డకుంటుంది. సోయా పాలు, చేపలు, నారింజ పండ్లు, చీజ్, గుడ్లు, పాల పదార్థాల్లో కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది.

అలాగే విటమిన్లు బి 6, బి12, సిలు తీసుకోవడం వల్ల కూడా మెదడు యాక్టీవ్ అయి.. డిప్రెషన్ నుంచి బయట పడొచ్చు. డిప్రెషన్ నుంచి బయట పడేసే ఆహారాలు చాలానే ఉన్నాయి.





























