AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Earthquake: ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి…భయంతో బిక్కుబిక్కుమంటున్న జనం

స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నట్టుండి భూమి కంపించటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు సెకండ్ల పాటు భూమి కనిపించినట్టు గుర్తించారు. తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రపురంలో భూప్రకంపనలు రాగా.. ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో ప్రకంపనలు వచ్చాయి.

Andhra Pradesh Earthquake: ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి...భయంతో బిక్కుబిక్కుమంటున్న జనం
Earthquake
Jyothi Gadda
|

Updated on: Dec 21, 2024 | 11:52 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ని భూ కంపం భయపెడుతోంది. ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నట్టుండి భూమి కంపించటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు సెకండ్ల పాటు భూమి కనిపించినట్టు గుర్తించారు.

ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రపురంలో భూప్రకంపనలు రాగా.. ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో ప్రకంపనలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. పలు గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులు అన్ని కదిలాయంటూ ప్రజలు వాపోయారు.

ఈ నెల 4న కూడా తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ములుగు జిల్లా మేడారం సమీపం కేంద్రంగా భూకంపం నమోదైంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.0గా నమోదైంది. ఈ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..