Viral video : అయ్యో పాపం..ఎర అనుకుని ఎగిరే డ్రోన్‌ను మింగేసిన మొసలి..! ఆ తర్వాత ఏమైందంటే?
ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న మాటలు కూడా వీడియోలో స్పష్టం వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరులేని మూగజీవాల పట్ల ఇలాంటి చర్యలు సరైనవి కావు అంటూ చాలా మంది వ్యాఖ్యనించారు. మనుషులు చేసిన నిర్లక్ష్యం కారణంగా అడవి జంతువులు నోరులేని జీవులు ఇలాంటి ప్రమాదాల బారినపడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Viral Video: భారీ వర్షాలు, వరదల సమయంలో మొసళ్లు తరచూ జనావాసాల్లోకి వచ్చి చేరుతుంటాయి. దాంతో కొందరు వాటిని సంరక్షించి అటవీశాఖకు అప్పగిస్తే.. మరికొందరు వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటారు. ఇలా మొసలికి సంబంధించి కూడా చాలా వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ఎరగా దొరికిన ఎలాంటి జీవినైనా సరై.. మొసలి తన పట్టుతో వేటాడి వెంటాడి మింగిస్తుంటాయి. ఎంతో చాకచక్యంగా దాడి చేసి ఎరను పట్టి నీటిలోకి లాక్కెళ్తుంటాయి. అయితే తాజాగా ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో నీటి కొలనుపై ఎగురుతున్న డ్రోన్‌ను ఎరగా భావించిన ఓ మొసలి దాన్ని అమాంతంగా మింగేసింది. ఆ తర్వాత జరిగిందంటే…
వైరల్ వీడియోలో నీటిపై డ్రోన్ ఎగురుతుండగా..ఆ నీటిలో ఉన్న మొసలి ఒకటి డ్రోన్‌ను గమనించింది. అదేదో పక్షి అనుకుందో ఏమో పాపం..అమాంతంగా ఆ డ్రోన్‌పై దాడి చేసింది. డ్రోన్ మింగిన వెంటనే అందులోని బ్యాటరీ పేలిపోయింది. దీంతో మొసలినోట్లోనే బ్యాటరీ పేలడంతో మొత్తం పొగ వ్యాపించింది. అయినా పట్టించుకోకుండా మొసలి దాన్ని మింగేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.‘droneshakk’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోని షేర్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
డ్రోన్‌లోని లిథియం అయాన్ బ్యాటరీలు మొసలి నోట్లో పేలడంతో పొగలు వ్యాపించాయి. కాసేపటికి పొగలు తగ్గిన తర్వాత గమనిస్తే.. మొసలి ఆ డ్రోన్‌ను కసిగా నములుతూ కనిపించింది. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న మాటలు కూడా వీడియోలో స్పష్టం వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరులేని మూగజీవాల పట్ల ఇలాంటి చర్యలు సరైనవి కావు అంటూ చాలా మంది వ్యాఖ్యనించారు. మనుషులు చేసిన నిర్లక్ష్యం కారణంగా అడవి జంతువులు నోరులేని జీవులు ఇలాంటి ప్రమాదాల బారినపడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..