Viral Video: కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్.. నేటి తరం నాన్న కూచి ఏమి చేసిందంటే
అపర్ణ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో కూతురు ఆర్యతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు కాలంలో నీ వయసు వచ్చే సరికి పెళ్లి అయ్యిపోయిది.. నీకు కనీసం కుక్కర్ మూత కూడా పెట్టడం రావడం లేదు అని అంటుంది అమ్మ. తల్లిదండ్రులు కూడా పిల్లలకు పని చెప్పకుండా.. ఆ కష్టమేదో మేము పడతాం.. పిల్లలు చదువుకుని సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటున్నారు. శ్రద్ధగా పెంచుతున్నారు. అందుకనే అమ్మ లేకపోతే వంట చేసుకోవడం రాకపోవడంతో.. స్విగ్గి జోమాటోలను ఆశ్రయించే అమ్మాయిల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో
కొన్ని ఏళ్ల క్రితం వరకూ తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పని సరిగా ఇంటి బాధ్యతలు నేర్పేవారు. మగ పిల్లలు బయటకు వెళ్లి పని చేయడం, ఆడ పిల్లలకు ఇంటి పనిని చక్క దిద్దుకోవడం అనే మనస్తత్వం ఉండేది. అందుకే ఆడపిల్లలకు చిన్న తనం నుంచి తల్లి ఇంటి పనులు, వంట పనులు నేర్పించేది. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. అన్ని విషయాల్లో మార్పులు వచ్చినట్లే.. తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆడపిల్లను మగ పిల్లవాడిలా పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందుకు తగినట్లు ఆడపిల్లలు మగవాళ్లకు తక్కువ కాదన్నట్లుగా పని చేస్తున్నారు. చదువులో మాత్రమే ఎన్నో విషయాల్లో ముందుంటున్నారు. అందుకనే ఆడపిల్లలు ఎంత పెద్దవారైనా సరే కనీసం అన్నం వండడం కూడా రావడం లేదు. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో.. ఇందులో యువతి కుక్కర్ మూత పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే అసలు ఆ కుక్కర్ మూత ఎలా పెట్టాలనే విషయంపై కనీస అవగాహన లేక కష్టకష్టాలు పడుతోంది.
1997 నుంచి 2012 మధ్య పుట్టిన పిల్లలకు ఏ పని సరిగ్గా తెలియని అపర్ణ అభిప్రాయపడింది. ఆ విషయం నిరుపించాలనుకుని తన కూతురుకి కుక్కర్ మూత పెట్టమని ఛాలెంజ్చేసింది. అయితే ఆ కుక్కర్ మూత ఎలా పెట్టాలనే విషయంపై ఆర్యకు కనీస అవగాహన కూడా లేదు. ఎంత ప్రయత్నించినా కుక్కర్ మూత పెట్టలేకపోయింది. తల్లి ఆ కుక్కర్ మూతని క్షణాల్లో పెట్టి.. భవిష్యత్ లో ఎలా వండుకుని తింటావు అని అంటే.. ఆర్య చెఫ్ ని పెట్టుకుంటా అని చెప్పింది.
View this post on Instagram
ఈ ఫన్నీ వీడియో 24 లక్షల వ్యూస్ ను సొంత చేసుకుంది. పలువురు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తనకు కొన్నాళ్ళ క్రితం వరకూ కుక్కర్ మూత పెట్టడం తెలియదని కొందరు కామెంట్ చేశారు. కుక్కర్ కూడా కొత్త తరం వారి కోసం అప్‌గ్రేడ్ చేస్తారని .. చెఫ్ కావాలంటే తనను సంప్రదించమని ఒకరు ఇలా రకరకాల ఫన్నీ కామెంట్స్ తో ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..