Maha Kumbha Mela: మహా కుంభ మేళాలో అతి ముఖ్యమైన రాజ స్నానం ఎప్పుడు? విశిష్టత, చేయాల్సిన దానం ఏమిటంటే

ఈసారి మహా కుంభ మేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు చేస్తారు. జనవరి 13 నుంచి అంటే పుష్య మాసం పౌర్ణమి తిధి నుంచి రాజస్నానాలు ప్రారంభమవుతాయి. దీని తరువాత.. మకర సంక్రాంతితో సహా ఇతర ప్రముఖ పర్వదినాల్లో రాజ స్నానాలు చేయనున్నారు. అయితే ఈ రోజు మహా కుంభమేళాలో రాజ స్నానల్లో ముఖ్యమైన స్నానం.. మూడవ రాజ స్నానం గురించి తెలుసుకుందాం.. ఈ రాజ స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్నానం చేసిన వ్యక్తికి మోక్షం లభిస్తుందని మరు జన్మ ఉండదని నమ్మకం.

Maha Kumbha Mela: మహా కుంభ మేళాలో అతి ముఖ్యమైన రాజ స్నానం ఎప్పుడు? విశిష్టత, చేయాల్సిన దానం ఏమిటంటే
Maha Kumbha Mela 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 21, 2024 | 3:51 PM

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళాను వచ్చే ఏడాది 2025 జనవరి 13 నుంచి నిర్వహించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగ. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు, సాధువుల సమ్మేళనం కనిపించనుంది. ఈ మహా కుంభ మేళా సమయంలో అందరూ భక్తి, విశ్వాసంలో గంగమ్మ ఒడిలో స్నానం ఆచరిస్తారు. ఈ మహా కుంభ మేళా జరిగే సమయంలో మొత్తం ఆరు రాజ స్నానాలు చేయనున్నారు. ప్రారంభ రోజైన జనవరి 13 న పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజ స్నానం చేయనున్నారు. అయితే మహా కుంభ మేళాలో అతి ముఖ్యమైన రాజ స్నానం గురించి ఈ రోజు తెలుసుకుందాం.. దీనిని మౌని అమావాస్య స్నానం అని కూడా అంటారు.

రాజ స్నానానికి అనుకూలమైన సమయం

మౌని అమావాస్యను మహా కుంభ మేళాలో అతి పెద్ద స్నానంగా భావిస్తారు. ఈ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మౌని అమావాస్య రోజున ఈ మహా కుంభ మేళాలో చేసే మూడవ రాజ స్నానం చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 29న మౌని అమావాస్య జరుపుకోనున్నారు. అంటే జనవరి 29న మౌని అమావాస్య రాజ స్నానం కూడా చేయనున్నారు. ఈ రోజు చేసే నదీ స్నానం, దానాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ రాజ స్నానం చేసే శుభ సమయం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ శుభ సమయం సాయంత్రం 6:18 గంటల వరకు ఉంటుంది.

మౌని అమావాస్య ప్రాముఖ్యత

మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. పూర్వీకులకు మోక్షాన్ని ఇచే ఈ అమావాస్య రోజున నదీ స్నానానికి విశిష్ట స్థానం ఉంది. ఇక కుంభ మేళా జరగనున్న నేపధ్యంలో ఈ అమావాస్య రోజున ప్రయాగరాజ్ సహా ఇతర పుణ్యక్షేత్రాలలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారు. ఈ రోజుల్లో ఉపవాసంతో పాటు మౌనం పాటించడం చాలా ముఖ్యం. హిందూ మతంలో మౌని అమావాస్య రోజున స్నానం చేయడమే కాదు శ్రాద్ధం, పూర్వీకుల సంతృప్తి కోసం ఇచ్చే దానానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. వాస్తవానికి ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి. అయితే మాఘ మాస అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. నెలలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మహా కుంభ మేళా, మౌని అమావాస్య కలయిక మతపరమైన దృక్కోణంలో అత్యంత ఫలవంతమైనదిగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ రోజు దానం చేయడం కూడా పుణ్యమే

హిందూ విశ్వాసాల ప్రకారం మౌని అమావాస్య నాడు స్నానం చేయడంతో పాటు, దానం చేయడం కూడా ముఖ్యంగా ఫలవంతంగా, పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. ఈ రోజు దానం చేసిన వ్యక్తి జీవితంలోని అన్ని పాపాలు పరిహారమవుతాయి. ఈ రోజున పూర్వీకులకు ఇష్టమైన, పూజలు, దానాలు చేయడంతో పూర్వీకులు సంతుష్టులయ్యారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.