Sankranti 2025: ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? స్నానం, దానం, పూజ శుభ సమయం ఎప్పుడంటే
మకర సంక్రాంతి అనేది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి. మూడు రోజుల పాటు జరుపుకునే పండగలలో రెండో రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం చూస్తే హిందువులు జరుపుకునే ముఖ్యమైన మొదటి పండుగ. ఈ రోజున పూజ, స్నానం, దానధర్మాలు చేయడం చాలా శ్రేయస్కరం అని నమ్మకం. ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగను ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం.
మకర సంక్రాంతి పండుగ కొత్త సంవత్సరం ప్రారంభంతో జరుపుకుంటారు. హిందూ మతంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏడాదికి 12 సంక్రాంత్రులు వస్తాయి. అయితే వీటిల్లో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాల్లో, భిన్నంగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు.
2025 మకర సంక్రాంతి ఎప్పుడు?
వేద పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ జనవరి 14 మంగళవారం జరుపుకుంటారు. ఈ రోజున సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలో ఉదయం 9.03 గంటలకు ప్రవేశించనున్నాడు.
మకర సంక్రాంతి రోజున స్నానం దానం చేయడానికి శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం మకర సంక్రాంతి రోజున స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం ఉదయం 9.03 నుంచి సాయంత్రం 05.46 వరకు ఉంది. ఈ శుభ సమయంలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర సమయం 8 గంటల 42 నిమిషాలు ఉండనుంది. దీంతో పాటు మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉదయం 9.03 గంటలకు ప్రారంభమవుతుంది.. 10.48 గంటలకు ముగుస్తుంది. ఈ పవిత్ర కాలం 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు కాలాల్లోనూ గంగాస్నానం చేయడం, దానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
మకర సంక్రాంతి ప్రాముఖ్యత
మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని పూజిస్తారు. ఈ పండుగ కొత్త పంటల ఆగమనానికి ప్రతీక. ఈ రోజున ప్రజలు కొత్త పంట ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ పండగను జరుపుకుంటారు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. మహాభారత కాలంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద నుంచి మకర సంక్రాంతి కోసం వేచి ఉన్నాడు. ఆ తర్వాత భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు. గీతలో కృష్ణుడు చెప్పిన ప్రకారం ఉత్తరాయణంలోని ఆరు నెలలలో శుక్ల పక్ష సమయంలో ఎవరైతే తమ శరీరాన్ని విడిచిపెడతారో వారు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.