Health Tips: 50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

వయస్సు పెరిగే కొద్దీ శరీరం బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా మారుతుంది. దీని కారణంగా శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో 50 సంవత్సరాల వయస్సులో కూడా ఫిట్‌గా , చురుకుగా ఉండటానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను గురించి నిపుణులు చెప్పారు. వీటిని పాటిస్తే వృద్దాప్యంలో కూడా నవ యువకుడిలా చలాకీగా ఉండొచ్చు అని అంటున్నారు.

Health Tips: 50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
Healthy Habits
Follow us
Surya Kala

|

Updated on: Dec 21, 2024 | 4:56 PM

వయస్సు పెరిగే కొద్దీ మనిషి శరీర సామర్థ్యాలు కూడా ప్రభావితమవుతాయి. అలసట, బలహీనత ,వ్యాధుల కారణంగా శరీరంలోని శక్తి స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. 50 సంవత్సరాల వయస్సుకు చేరుకున్న తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లపై శ్రద్ధ వహించాలి.

ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చని ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర్ అరవింద్ అగర్వాల్ (సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్) అంటున్నారు. ఈ వయస్సులో కొన్ని చెడు అలవాట్లలో కొన్నింటిని అయినా వదులుకోవలసి ఉంటుంది. కనుక ఈ రోజు నిపుణులు చెప్పిన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం..

క్రమం తప్పకుండా వ్యాయామం

అన్నింటిలో మొదటిది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం జీవనశైలిలో భాగం చేసుకోండి. ఈ వయస్సులో ఎవరి శరీరమైనా సరే విశ్రాంతిని కోరడం ప్రారంభిస్తుంది. అందుకనే వ్యాయామానికి దూరంగా ఉంటారు. ఇలా వ్యాయామం చేయడానికి చేసే నిర్లక్షం.. తరువాత అతని శరీరానికి చాలా నష్టాలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. నడక వంటి తేలికపాటి వ్యాయామాలను రోజువారీ దినచర్యలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి

50 ఏళ్ల వయస్సులో ఫిట్‌గా ఉండాలంటే.. తప్పని సరిగా సమతుల్య ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి వాటిని చేర్చుకోవాలి. బయటి నుంచి తెచ్చుకున్న ఆహారానికి దూరంగా ఉండాలి. ప్యాక్ చేసిన ఆహారాన్ని ఉపయోగించవద్దు. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండడం మేలు.

తగినంత నిద్ర ముఖ్యం

అంతేకాదు రోజులో తగినంత నిద్ర పొందడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఈ వయసులో ఫిట్‌గా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడి మీ మానసిక సమస్యలను పెంచడమే కాదు మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో యోగా , ధ్యానం సాధన చేయాలి.

ఈ నియమాలన్నీ పాటిస్తూ.. శరీరాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనల మేరకు జీవనశైలిని అనుసరించడం వలన 50 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉంటారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..