Venus Transit 2024: ఈ నెల 28 కుంభరాశిలో శుక్రుడు సంచారం.. ఈ రాశి మహిళలకు స్వర్ణకాలమే..

అష్టగ్రహాల్లో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. సంపదలకు విలాసాలకు అధిపతి, ఆనందం , శ్రేయస్సును ఇచ్చే శుక్రుడు డిసెంబర్‌లో మరోసారి తన రాశిని మార్చబోతున్నాడు. ఇలా శుక్రుడు సంచార ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది.

Venus Transit 2024: ఈ నెల 28 కుంభరాశిలో శుక్రుడు సంచారం.. ఈ రాశి మహిళలకు స్వర్ణకాలమే..
Venus Transit 2024 In Aquarius
Follow us
Surya Kala

|

Updated on: Dec 21, 2024 | 2:51 PM

జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం ఆనందం, శ్రేయస్సు, అందానికి అధిపతిగా పరిగణించబడుతున్నాడు. అన్ని గ్రహాల మాదిరిగానే శుక్రుడు కూడా ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మార్చుకుంటాడు. 26 రోజుల తర్వాత శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈసారి శుక్రుడు తన స్నేహితుడైన శనీశ్వరుడు అధిపతి అయిన కుంభరాశిలో అడుగు పెట్టి అక్కడ సంచరిస్తాడు. ఈ శుక్ర సంచరంల్తో మొత్తం 12 రాశుల ప్రజలను ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు శుక్రుని సంచారంతో అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు శుక్ర సంచారంతో ఏ రాశుల వారికి స్వర్ణకాలం మొదలవుతుందో తెలుసుకుందాం.

శుక్ర సంచారం ఎప్పుడంటే

శుక్ర గ్రహం ప్రస్తుతం మకరరాశిలో ఉంది. డిసెంబర్ చివరి వారంలో అంటే డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11.28 గంటలకు శుక్రుడు మకర రాశిని విడిచి శనీశ్వరుడు అధిపతి అయిన కుంభరాశిలో సంచరిస్తాడు. దీంతో నాలుగు రాశులకు స్వర్ణకాలం ఈ సమయం అని చెప్పవచ్చు.

ఏ రాశుల వారు లాభపడతారంటే

మేషరాశి: శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత మేషరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మేష రాశి వారికి శుక్రుని సంచారం ఆర్థికంగా మరింత లాభదాయకంగా ఉంటుంది. మెరుగైన ఆదాయంతో పాటు మెరుగైన పెట్టుబడి అవకాశాలు కూడా ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ప్రేమ సంబంధాలలో సమన్వయం పెరుగుతుంది. బంధం బలపడుతుంది. అంతేకాదు ఈ రాశికి చెందిన వారు పిల్లల వలన ఆనందాన్ని పొందుతారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: కుంభరాశిలో శుక్రుని సంచారం మిథునరాశి వారికి శుభదాయకం. ఈ కాలంలో మిథున రాశి వారికి తండ్రి, గురువు , మార్గదర్శకుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. దీంతో పాటు శుక్రుని ప్రభావం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహ రాశి: కుంభరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల సింహ రాశి వారికి వివాహ సంబంధిత సమస్యలు తీరుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆదాయ వనరులను పెంచే వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం ఉంటుంది. అంతేకాదు సింహరాశి వ్యక్తులు ప్రేమ విషయంలో పూర్తి మద్దతును పొందుతారు.

కుంభ రాశి: కుంభరాశిలో శుక్రుని సంచారం వల్ల పెద్ద మార్పులు కనిపిస్తాయి. అదృష్టం వీరి సొంతం. చేపట్టిన ప్రతి పని పూర్తి మద్దతుతో ప్రతి పని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాస్తుల పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. శుక్రుడి ప్రభావం వల్ల ఆరోగ్యం, అందం పట్ల శ్రద్ధ వహిస్తారు. జీవితంలో కొత్త ప్రేమ రావచ్చు. కుంభరాశి స్త్రీలలో ఆప్యాయత, ప్రేమ, దయ అనే భావం పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.