Malavya Yoga: ఆ నాలుగు రాశుల వారికి ‘మాలవ్య’ యోగం! వారికి పట్టిందల్లా బంగారమే..
Maha Purusha Yoga 2025: వచ్చే ఏడాది(2025) జనవరి 28 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు శుక్ర గ్రహం తనకు ఉచ్ఛ స్థానమైన మీన రాశిలో సంచారం చేయబోతోంది. భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుకుడు శుక్రుడు. మీన రాశిలో శుక్ర సంచారంతో నాలుగు రాశులకు మాలవ్య మహా పురుష యోగం పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిన పంచ మహా పురుష యోగాల్లో మాలవ్య మహా పురుష యోగం ఒకటి.
Malavya Yoga 2025: జనవరి 28 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు శుక్ర గ్రహం తనకు ఉచ్ఛ స్థానమైన మీన రాశిలో సంచారం చేయబోతోంది. భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు నాలుగు రాశులకు మాలవ్య మహా పురుష యోగం పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిన పంచ మహా పురుష యోగాల్లో మాలవ్య మహా పురుష యోగం ఒకటి. శుక్రుడు ఏ రాశికైనా 1, 4, 7, 10 రాశుల్లో ఉచ్ఛ లేదా స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ మాలవ్య మహా పురుష యోగం పడుతుంది. జనవరి 28 నుంచి సుమారు వంద రోజుల పాటు మిథున, కన్య, ధనుస్సు, మీన రాశులకు ఈ మహాపురుష యోగం పడుతోంది. ఈ యోగం వల్ల ఏ రంగంలో ఉన్నవారైనా ఉన్నత పదవులు పొందడం, ఒక ప్రముఖుడుగా చెలామణీ కావడం, పట్టిందల్లా బంగారం కావడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశికి సప్తమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛరాశిలోకి రావడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలు విశే షంగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఉద్యో గంలో పదోన్నతులు లభిస్తాయి. జనాకర్షణ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. వారసత్వ సంపద లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై, విలువైన ఆస్తి చేజిక్కుతుంది. ఆస్తిపాస్తులు కొనే అవకాశం ఉంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెల కొంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నిరుపేద కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశికి రాశి కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా సిరిసంపదలు కలుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. జనాకర్షణ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.