Astrology 2025: ఐదు గ్రహాల అనుగ్రహం.. ఆ రాశుల వారికి అదృష్టం పండబోతోంది..!

Lucky Horoscope 2025: కొత్త సంవత్సరం(2025)లో అయిదు రాశుల వారి అదృష్టం పండబోతోంది. మొత్తం తొమ్మిది గ్రహాల్లో అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది అరుదైన విషయం. అయితే, ఈసారి వృషభం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశులకు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వీరికి ఈ ఏడాదంతా నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోయే అవకాశం ఉంది.

Astrology 2025: ఐదు గ్రహాల అనుగ్రహం.. ఆ రాశుల వారికి అదృష్టం పండబోతోంది..!
Astrology 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 20, 2024 | 8:02 PM

Telugu Astrology 2025: కొత్త సంవత్సరంలో అయిదు రాశుల వారి అదృష్టం పండబోతోంది. మొత్తం తొమ్మిది గ్రహాల్లో అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది అరుదైన విషయం. అయితే, ఈసారి వృషభం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశులకు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వీరికి ఈ ఏడాదంతా నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోయే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించడం, ఆదాయం బాగా వృద్ధి చెందడం, ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం, విదేశీయాన యోగం పట్టడం, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సిద్ధించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

  1. వృషభం: ఈ రాశికి శని, గురు, రాహువుల వంటి ప్రధాన గ్రహాలతో పాటు శుక్ర, కుజుల అనుకూలతలు కూడా కలగడం వల్ల కొత్త సంవత్సర ప్రారంభం నుంచి వీరి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పద వులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి అష్టమ శని తొలగిపోవడం పెద్ద ఉపశమనం కాగా, అయిదు గ్రహాలు అనుకూలంగా మారడం ఒక పెద్ద విశేషం. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలుగు తాయి. ఆదాయం విపరీతంగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
  3. తుల: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడితో సహా ప్రధానగ్రహాలన్నీ అనుకూలంగా మారడం వల్ల ఆదాయం లోనూ, ఉద్యోగపరంగానూ వీరికి పట్టపగ్గాలుండవు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల వర్షం కురిపిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ది చెందుతాయి. సామాజికంగా కూడా పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది.
  4. మకరం: ఈ రాశికి కొత్త ఏడాది నుంచి జీవితం సానుకూలంగా మారే అవకాశం ఉంది. శుక్రుడు కుంభ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి వీరి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో మంచి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. జీవనశైలి మారి పోతుంది. ప్రముఖుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు.
  5. కుంభం: ఈ రాశికి అయిదు గ్రహాల అనుకూలత వల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించి పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులే షన్ల వంటివి లాభాలు కురిపిస్తాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.