Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!

వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఏప్రిల్ వరకు శుక్రుడు తన ఉచ్ఛ రాశిలో, అంటే మీన రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మీన రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న రాహువుతో యుతి చెందుతాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర, రాహువులు గురు శిష్యులు. ఈ రెండు గ్రహాలు కలిసి నప్పుడు గుప్త నిధులు లభిస్తాయని, లంకె బిందెలు దొరుకుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఆధునిక కాలంలో ఈ విధంగా జరిగే అవకాశం లేదు కనుక వాటి స్థానంలో ధన లాభాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశులు ఈ గురు శిష్యుల యుతి వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 21, 2024 | 4:59 PM

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడమే ఒక విశేషంకాగా అక్కడ రాహువుతో యుతి చెందడం వల్ల అపర కుబేర యోగం పట్టే అవకాశం ఉంటుంది. లాభ స్థానంలో రాహువు వల్ల తప్పకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవు తుంది. అదనపు ఆదాయానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో వివాహంకుదురుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి  భాగ్య స్థానంలో శుక్ర, రాహువుల కలయిక వల్ల జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. దాదాపు కోటీశ్వరులు కావడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహ సంబంధం కుదురుతుంది. వారసత్వ సంపద లభి స్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తులవిలువబాగా పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

2 / 6

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర, రాహువులు కలుస్తున్నందువల్ల ఉద్యోగంలో అనుకోకుండా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. జీతభత్యాలు భారీగా పెరగవచ్చు. వృత్తి, వ్యాపా రాల్లో కష్టనష్టాలు తగ్గి లాభాలు బాగా  పెరిగే అవకాశం ఉంది. ఉన్నతస్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది.

3 / 6
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, రాహువుల యుతి జరుగుతున్నందువల్ల కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కార మవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

4 / 6
మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శుక్ర రాహువుల కలయిక రాజయోగాలనిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో కొత్త లాభావకాశాలు కలుగుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలు, హోదాతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా లభించే సూచనలున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. మనసులోకి కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరడం జరుగుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో రాహువు కలుస్తున్నందువల్ల అనేక విధాలుగా  ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. అనేక విధాలుగా అదృష్టం కలు గుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అనేక శుభవార్తలు వింటారు.

6 / 6
Follow us