మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పూర్తి చేయడంలో శ్రమ, తిప్పట పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచే కాక, సహోద్యోగుల నుంచి కూడా సమస్యలు తలెత్తుతాయి. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. పునర్వసువారికి అధికార యోగం ఉంది.