AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: రష్యాపై ఉక్రెయిన్ 9/11 తరహా దాడి.. 6 భవనాలపై డ్రోన్లతో ఎటాక్

రష్యాపై ఉక్రెయిన్ వరస బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. రష్యాపై 9/11 తరహా దాడిని ప్రారంభించింది. కజాన్‌లోని 6 భవనాలపై ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ దాడి చేసింది. దాడి అనంతరం ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. ప్రజలు భవనాలను ఖాళీ చేశారు. దాడి జరిగిన ప్రాంతలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరి ఈ దాడులకు రష్యా రియాక్షన్ ఏమిటనేది తెలియాల్సి ఉంది.

Russia: రష్యాపై ఉక్రెయిన్ 9/11 తరహా దాడి.. 6 భవనాలపై డ్రోన్లతో ఎటాక్
Ukraine Strike On Kazan
Surya Kala
|

Updated on: Dec 21, 2024 | 2:25 PM

Share

అగ్ర రాజ్యం అమెరికా సమయంలో ఉక్రెయిన్ నిరంతరం రష్యా పై విరుచుకుపడుతోంది. రష్యాలోని ప్రధాన నగరాలపై బాంబు దాడి చేస్తోంది. విధ్వంసక క్షిపణులను ఉపయోగించడానికి బిడెన్ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడమే కాదు… ఉక్రెయిన్ కు ఆయుధ సహాయం కూడా చేస్తోన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్ మరింత ఘోరంగా రష్యాపై విరుచుకుపడుతోంది. నివేదికల ప్రకారం.. క్రెయిన్ శనివారం రష్యాపై 9/11 తరహా దాడి చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ కజాన్‌లోని 6 భవనాలపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి తరువాత ఈ మొత్తం ప్రాంతమంతా గందరగోళం నెలకొంది.

దాడి తర్వాత భవనాలను ఖాళీ చేయించారు. పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. దాడి తర్వాత సహాయక చర్యలు జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ దాడి జరిగింది. సమీపంలోని విమానాశ్రయం మూసివేయబడింది.

ఇవి కూడా చదవండి

ప్రాథమిక సమాచారం ప్రకారం ఉక్రెయిన్ సైన్యం సుమారు 8 డ్రోన్లతో కజాన్‌లోని 6 భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ నిరంతర దాడుల కారణంగా ఈ నగరంలోని ప్రజలు భూగర్భ ఆశ్రయాలలో నివసించవలసి వస్తుంది. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కజాన్ నగర మేయర్ కోరారు.

దాడి ఎక్కడ జరిగింది?

ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రోన్‌లు కమలేవ్ అవెన్యూ, క్లారా జెట్‌కిన్ స్ట్రీట్, యుకోజిన్స్‌కయా, ఖాదీ తక్తాష్ , క్రాస్నాయా పొజిట్సియాలోని భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఓరెన్‌బర్గ్‌స్కీ ట్రాక్ట్ స్ట్రీట్‌లోని ఓ భవనాన్ని మరో రెండు డ్రోన్‌లు టార్గెట్ చేశాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు అయినట్లు సమాచారం లేదు. దాడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. చేయబడ్డాయి

దాడి తరువాత రష్యాలోని టాటర్స్తాన్ ప్రాంతం ప్రభుత్వం రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని సామూహిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఉక్రెయిన్‌ చేస్తోన్న దాడులను రష్యా తేలిగ్గా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయనే భయం కనిపిస్తోందని అంటున్నారు. అయితే ప్రతి దాడికి తగిన సమాధానం చెబుతామని రష్యా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన ఈ దాడికి రష్యా ఏం సమాధానం చెబుతుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!