AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..? ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తున్న బుడ్డొడి మాటలు..

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని చిన్నపిల్లల వీడియోలు కూడా తరచూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 31 మిలియన్ వ్యూస్, 1.9 మిలియన్ లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ క్లిప్‌ను చాలా ఇష్టపడ్డారు. దీనిపై వేలాది మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..? ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తున్న బుడ్డొడి మాటలు..
Back To Back Exams
Jyothi Gadda
|

Updated on: Dec 21, 2024 | 1:04 PM

Share

ప్రస్తుత పోటీ యుగంలో పసి పిల్లలపై చదువుల ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..ప్రతిరోజూ వారికి క్లాస్ టెస్ట్‌లు, ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్లు, ఇలా ఆ టెస్ట్‌లు ఈ టెస్ట్‌ అంటూ ప్రతిరోజూ వారికి పరీక్ష ఎదురవుతుంది. బ్యాగుల మోత, చదువుల భారంతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఓ చిన్నారి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. పదే పదే పరీక్షలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ పసివాడు సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి కళ్లలో నీళ్లు తిరుగుతుంటే.. తన కష్టాన్ని వివరించాడు. ఎంతో బాధాకరమైన స్వరంతో చెబుతున్నాడు..హాలో ఫ్రెండ్స్‌.. మనం కూడా హాయిగా జీవించాలి.. అవునా? మనం కూడా సంతోషకర జీవితాన్ని గడపాలి.. కానీ పరీక్షల తర్వాత పరీక్ష.. పరీక్ష తర్వాత పరీక్షలతో మనం కష్టపడిపోతున్నాం..అందుకే నేను ప్రధాని అయ్యాక ఈ పరీక్షలను నిషేధిస్తాను. అప్పుడు ఆ బుడ్డొడి తండ్రి అంటాడు – నువ్వు నటించాలి అని చెప్పాను..ఈ పరీక్షల ప్రస్తావన ఎందుకు వచ్చిందని సీరియస్ అవటం వీడియోలో కనిపించింది. ఇకపోతే, ఇంటర్‌నెట్‌లో వీడియో అప్‌లోడ్‌ చేయటంతో అది కాస్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Negi & Family (@avi.rashi)

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ avi.rashiలో షేర్ చేయబడింది. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 31 మిలియన్ వ్యూస్, 1.9 మిలియన్ లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ క్లిప్‌ను చాలా ఇష్టపడ్డారు. దీనిపై వేలాది మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు