RRR: 'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో 'RRR' డాక్యుమెంటరీ టిక్కెట్లు..

RRR: ‘RRR’ డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో ‘RRR’ డాక్యుమెంటరీ టిక్కెట్లు..

Anil kumar poka

|

Updated on: Dec 21, 2024 | 4:28 PM

రామ్‌చరణ్‌,​ జూనియర్ ఎన్​టీఆర్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన బ్లాక్​బస్టర్ మూవీ 'ఆర్ఆర్‌ఆర్‌'. పీరియాడిక్ యాక్షన్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్​ సాధించి దూసుకెళ్లింది. అయితే ఇప్పుడా చిత్రానికి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ అలాగే మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను డాక్యుమెంటరీ రూపంలో చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు.

‘ఆర్ఆర్ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ అనే పేరుతో ఆ డాక్యుమెంటరీని సిద్ధం చేసింది. అందులో షూటింగ్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ‘ఆస్కార్‌’ అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ థియేటర్లలో విడుదల కానుంది. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన కొన్ని మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో దాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ క్రమంంలో ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్‌ మై షో’లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచారు. రూ.200 నుంచి రూ.300 వరకూ ఆ టికెట్ల ధర ఉంది. అయితే 1 గంట 38 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో మూవీ టీమ్​ ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి ఇప్పటివరకూ ప్రేక్షకులకు తెలియని పలు ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు కూడా నెట్టింట మంచి రెస్పాన్స్​ దొరికింది.

ఇక ‘ఆర్​ఆర్​ఆర్​’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తెలుగులోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్స్ ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. వరల్డ్​వైడ్​గా​ ఈ చిత్రం సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది. మరోవైపు ఓటీటీలోనూ ఈ చిత్రం హవా చూపింది. దీన్ని పలు భాషల్లో డబ్‌ చేయగా అక్కడ కూడా రికార్డు స్థాయిలో వసూలు చేసింది. జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించి ఏకంగా 300 మిలియన్​ జపాన్‌ యెన్‌ల క్లబ్‌లో చేరింది. మన కరెన్సీలో రూ.18 కోట్లు వసూలు చేసింది. ఈ క్లబ్‌లోకి చేరిన తొలి భారతీయ సినిమాగా ‘ఆర్ఆర్‌ఆర్‌’ అరుదైన ఘనత సాధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Dec 21, 2024 04:25 PM