Venu Swamy: నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.

Venu Swamy: నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.

Anil kumar poka

|

Updated on: Dec 21, 2024 | 5:10 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనను గెలకడం వల్లే ఇండస్ట్రీలో కలకలం మొదలైంది అని వేణు స్వామి అన్నారు. ఇండస్ట్రీలో నాలుగు పెద్ద సంఘటనలు జరగడం మీ జీవితంలో ఎప్పుడైనా చూశారా..? అని వేణు స్వామి అన్నారు. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో ఈయన పాపులర్ అయ్యారు. అదే స్థాయిలో వివాదాలనూ ఫేస్ చేశారు.

సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన కూడా చేశారు. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు ఈయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. ఇలా చిక్కుల్లో పడ్డ వేణు స్వామి కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ ముందు ప్రత్యక్షం అయ్యారు. రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు వేణు స్వామి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన పై విమర్శలు చేసినందుకే ఇండస్ట్రీ చిక్కుల్లో పడింది అని అన్నారు.

ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను గెలికినప్పటి నుంచే ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యిందీ ఆలోచించాలనీ 2025 మార్చ్ నుంచి రాజకీయాల్లో పెను సంచలనాలు జరగనున్నాయనీ అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ గింగిరాలు తిరుగుతుంది అని తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పాననీ.. ఇలాంటి నాలుగు పెద్ద ఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా చూశారా.? అని ప్రశ్నించారు. ఓ స్టార్ హీరో కన్వెన్షన్ ను కూల్చేయడం.. ఓ పెద్ద దర్శకుడు.. భారతదేశానికే పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ చేయడం, పాన్ ఇండియా హీరోపై కేసు పెట్టడం, 70ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు.. ఇవన్నీ ఎప్పుడైనా చూశారా..? తాను ఎప్పుడో ఆగస్టులోనే ఇదంతా చెప్పాననీ ఇంకా చాలా జరుగుతాయి అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.