Butter Tea: బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

Butter Tea: బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

Anil kumar poka

|

Updated on: Dec 21, 2024 | 4:54 PM

మన దేశంలో చాయ్‌ ప్రియులు చాలా మంది ఉన్నారు. టీ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు.. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. సంతోషం, బాధ.. సందర్భం ఏదైనా సరే.. చాయ్‌ పార్టీ జరగాల్సిందే. ఇకపోతే, ఇలాంటి చాయ్‌ తయారీకి సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న ప్రయోగాలు వైరల్‌ అవుతుంటాయి. ఈసారి కూడా ఓ మహిళ టీ స్టాల్‌ వైరల్ అవుతోంది.

ఒక మహిళ తయారు చేసిన చాయ్‌ ఇంటర్నెట్ వినియోగదారులను ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి వెరైటీ టీ తయారు చేస్తున్న మహిళను ఉద్దేశించి నెటిజన్లు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ టీ వీడియోపై చాలా మంది తీవ్రంగా స్పందించారు. కొందరు ఆమెపై దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా రాశారు. మేం ఢిల్లీకి వస్తున్నాం. టీ తాగడానికే కాదు నీకు గుణపాఠం చెప్పడానికి. తప్పకుండా లక్ష్మీనగర్ వస్తున్నాం అంటూ బెదిరించారు. మరొకరు స్పందిస్తూ.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ ఆ టీ అంత స్పెషల్ ఏంటా అని చూస్తే.. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో టీ అమ్ముతున్న ఒక మహిళ ప్రత్యేకించి బటర్ టీ తయారు చేసింది. అయితే, ఆమె స్టాల్‌కి వచ్చిన ఓ కస్టమర్‌ 5 రూపాయలకు టీ కావాలని అడుగుతాడు.. అందుకు ఆమె స్పందిస్తూ.. హాలో బ్రదర్‌ ఇక్కడ 5 రూపాయలకు టీ రాదని చెప్పింది. ఇక్కడ చాయ్‌ విలువ యాభై రూపాయలు అని తెలిపింది. అందుకు ఆ వ్లాగర్‌ షాక్‌ అవుతాడు. సరే అక్కా.. అదే టీ ఇవ్వు అని అడుగుతాడు.. దాంతో ఆమె అతనికి టీ సర్వ్‌ చేసింది.

అప్పటికే, తయారు చేసి ఫ్లాస్క్‌లో పోసి ఉంచిన టీని ఆమె ఓ సాసర్‌లో సర్వ్‌ చేసింది. ఆ పై అందులో ఓ ప్రముఖ కంపెనీ వెన్న కలిపింది. ఆమె టీ చేయడానికి అదే కంపెనీ పాలను ఉపయోగించినట్లు చెప్పింది. ఆ తరువాత అందులోనే బటర్ కూడా వేసింది. ఇప్పుడు బటర్‌ టీ రెడీ అని చెప్పింది. ఇది చూసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు షాక్‌ అవుతున్నారు. బాబోయ్‌ ఇదేం టీ తల్లీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.