Viral: ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు.!
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఓ పార్సెల్ కొరియర్ అయింది.. ఢిల్లీలో ఆ అడ్రస్ తప్పుగా ఉండడంతో అక్కడ పార్సిల్ బాయ్ కి అనుమానం వచ్చింది. ఆ సమాచారాన్ని విశాఖలోని పార్సల్ సంస్థకు అందించి తిరిగి ఆ పార్శిల్ ను వెనక్కి పంపారు. దీనిపై పోలీసులకు సైతం సమాచారం అందించారు.. వెరిఫై చేస్తే అందులో ఉన్నది గంజాయి అని తేలింది.. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
ఆ పార్సల్ పంపిన అడ్రస్‌ను తెలుసుకున్న పోలీసులు వెరిఫై చేశారు. విశాఖపట్నంలోని శ్రీహరిపురం ప్రాంతం 60 వ వార్డు ఎంఐజి 1.. 22-65-5-22 క్వార్టర్ గా గుర్తించారు పోలీసులు. అది ఒక పాడుబడిన ఇల్లు. ప్రమోద్ అనే వ్యక్తి పేరు పై ఆ ఇల్లు ఉంది. అయితే.. అక్కడికి వెళ్లిన పోలీసులు వెరిఫై చేసేసరికి ఇంట్లో 100 కిలోల గంజాయి బయటపడింది. అక్కడ ఎవరూ లేరు. ఆ ఇంటిని నెలకు 9వేల రూపాయలకు యజమాని అద్దెకిచ్చినట్టు.. అందులో బీహార్ కు చెందిన యువకులు నివాసం ఉంటున్నట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇంటిని సీజ్ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
గంజాయి స్మగ్లింగ్ పై నిఘా పెరగడంతో.. స్మగ్లర్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల రైల్వే స్టేషన్‌లో అనుమానితులను పట్టుకొని డ్రై ఫ్రూట్స్ పార్సల్స్‌గా గంజాయిని తరలిస్తున్న వ్యవహారాన్ని రైల్వే పోలీసులు బట్టబయలు చేశారు. ఆ తర్వాత పోలీసులు నిఘా పెంచి.. కొరియర్ సర్వీస్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయి గుట్టును రట్టుచేస్తున్నారు.. తాజాగా జరిగిన ఘటన అంతకు మించి అనేలా అందరినీ షాక్ కు గురిచేసింది. ఢిల్లీకి కోరియర్ పంపితే.. విశాఖలోని ఓ పాడుబడ్డ ఇంట్లో గుట్టగుట్టలుగా గంజాయి బయటపడటం కలకలం రేపుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

