17 December 2024
Subhash
ఆధార్.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆధార్ కార్డు లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ సేవ కోసం గడువును మళ్లీ పొడిగించింది.
ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్‌ను 14 జూన్ 2025 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
ఇంతకుముందు ఈ గడువు డిసెంబర్ 14, 2024 వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దానికి దాదాపు 6 నెలల సమయం ఇచ్చింది.
ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు అవుతున్నవారి వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించింది. దీంతో ఎలాంటి ఫీజుల లేకుండా అప్‌డేట్ చేసుకోవాలి.
UIDAI ఆధార్ కార్డ్ హోల్డర్‌లను సులభతరం చేయడానికి, వారి సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి ఈ చర్య తీసుకుంది.
ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్ చేసుకునేందుకుద ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అయితే వచ్చే ఏడాది జూన్ 14 తర్వాత ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ లోపే చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.