Watch: శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ పార్వతి అమరలింగేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఉదయం ఆలయాన్ని శుద్ధి చేయడానికి వెళ్లిన పూజారి దివాకర్ శర్మకు గర్భగుడిలో నాగుపాము పడగ విప్పి దర్శనమిచ్చింది. స్వామివారికి అభిషేక సమయంలో కూడా నాగుపాము ఎంతకూ బయటికి పోకపోవడంతో ఇదంతా శివలీలగా భావించారు.
ఆలయంలోని గర్భగుడిలోకి నాగుపాము ప్రవేశించిందని భక్తులకు తెలియడంతో వారంతా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. ఈ క్రమంలో భక్తులు నాగుపాముకు ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. గర్భగుడిలోని శివలింగం వద్ద పడగవిపి ఉన్న నాగుపామును భక్తులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. పర్వదినం రోజున ఆలయ గర్భగుడిలోకి నాగేంద్రుడి రూపంలో స్వామివారు దర్శనం ఇవ్వడం శుభకరం అని పూజారి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos