వివిధ జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తెల్ల పసుపును విస్తృతంగా ఉపయోగిస్తారు. కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి లేకపోవటం, కడుపు బగ్,గ్యాస్, మలబద్ధకం, తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తెల్లపసుపులోని ఔషధ గుణాలు సహజ సిద్ధమైన యాంటీ అల్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. తెల్ల పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల స్రావానికి సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.