Telangana: వారెవ్వా..? ఐడియా అదుర్స్ కదూ..! అరటి పండ్ల వ్యాపారి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
తెలంగాణలో వానర మూకలు రెచ్చిపోతున్నాయి. చేతికి అంది వచ్చిన పంటలపై దాడులు చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలంగాణలో వానర మూకలు రెచ్చిపోతున్నాయి. అటు గ్రామాల్లో మహిళలు, పిల్లలపై కూడా దాడులు చేస్తున్నాయి. దీంతో వానర మూకల నుంచి రక్షించాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఇటీవల వానరాల దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఓ పండ్ల వ్యాపారి భలే ఐడియా వేశాడు.
తెలంగాణ జిల్లాల్లో కోతులు హడలెత్తిస్తున్నాయి. పంటలపై దాడులు చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటు గ్రామాల్లో మహిళలు, పిల్లలపై కూడా దాడులు చేస్తున్నాయి. కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. కొందరు కొండముచ్చును గ్రామాలలో తిప్పడం చూశారు.. ఇంటి ముందు కొండముచ్చు, పెద్దపులి బొమ్మలు పెట్టి కోతులను భయపెట్టడం చూశాం.. కానీ ఓ అరటి పండ్ల వ్యాపారి ఐడియా అదుర్స్.. ఆ సైరన్ తో అరటిపండ్ల వ్యాపారి వాహనం వస్తుందంటే చాలు కోతులన్ని పారిపోయతున్నాయి.
మీరు ఇప్పటివరకు పోలీస్ సైరన్ విని ఉంటారు. అంబులెన్స్ సైరన్ కూడా విని ఉండొచ్చు. కానీ ఈ సైరన్ మాత్రం వేరే లెవెల్.. అదే డాగ్ సైరన్. డాగ్ వాయిస్‌తో కోతులను అదరగొట్టడం మీరు చూశారా… కోతులు హడలెత్తి పోవడం చూస్తే.. “వాటే ఐడియా సర్ జీ” అని అనాల్సిందే..! దేవెందర్ అనే ఆటో డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట నుండి కొత్తగూడకు రోజు అరటి పండ్లను తీసుకెళ్తుంటాడు. ఈ ప్రధాన రహదారిపై వేలాది కోతులు ఉంటాయి. కొత్తగూడ రహదారిపై ఎంటర్ అవడంతోనే కోతుల గుంపు అరటిపండ్లను లాక్కొని వెళ్ళేవి. దీంతో తట్టుకోలేక రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు.
కానీ ఒక ఐడియా అతని పండ్ల వ్యాపారానికి పూర్తి భరోసాగా నిలిచింది. కుక్కల వాయిస్ వింటే కోతులు హడలెత్తి పోతుంటాయి. కోతులను భయపెట్టాలంటే ఇదే సరైన మార్గమని భావించాడు. కుక్కల వాయిస్‌తో ఓ సైరన్ ను తయారు చేపించి, సరిగ్గా ఆ ప్రాంతం రాగానే.. కుక్కల వాయిస్ తో కూడిన సైరన్ ను వేసుకొని వాహనంపై వెళ్తుంటాడు. కుక్క వాయిస్ వేయడంతో కోతులు పారిపోతున్నాయి.
దీంతో ఆటోవాలా ఐడియా అదుర్స్ అని అతనిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఇటీవల కోతుల బెడద తీవ్రంగా ఉంది అనడానికి ఇటీవల కోతుల దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన కూడా ఇక్కడే చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్కసారిగా బైక్ బ్రేక్ వేయడంతో మద్దెల నాగమణి అనే మహిళా వెనుక వైపు తిరిగి పడటంతో తలకు గాయం అయి తీవ్ర రక్తస్రావం కావడంతో సమీప ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తే… పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కొత్తగూడలో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాలను కోతుల జనావాసాలుగా మార్చుకుంటున్నాయి. ఆకలితో అలమటిస్తూ వాహన దారులపై దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పంట పొలాలకు నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాలను తెచ్చి పెడుతున్నాయి అంటూ మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కోతల నుండి భద్రత కోసం అక్షరాజ్ఞానం లేని ఇలాంటి వారిలోని శాస్త్రీయతను వెలికి తీయాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ పండ్ల వ్యాపారి ఐడియాను చూసి ప్రతి ఒక్కరు వాహ్ అదుర్స్ అంటున్నారు..!
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..