Fish Fry: ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..

శరీరంలో ఉండే అన్ని భాగాలకు కూడా చేపలు మేలు చేస్తాయి. ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును బయటకు పంపిస్తాయి. గుండె పని తీరును కూడా మెరుగు పరుస్తాయి. అయితే ఎప్పుడూ పులుసు తినాలన్నా బోర్ కొడుతుంది. ఫిష్ ఫ్రై అంటే మరింత ముందుకు వస్తారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి..

Fish Fry: ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
Fish Fry
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2024 | 9:41 PM

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే చికెన్, మటన్ కంటే చేపలు తినడమే బెటర్. అందుకే కనీసం వారంలో ఒకసారైనా చేపలు తినాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. శరీరంలో ఉండే అన్ని భాగాలకు కూడా చేపలు మేలు చేస్తాయి. ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును బయటకు పంపిస్తాయి. గుండె పని తీరును కూడా మెరుగు పరుస్తాయి. అయితే ఎప్పుడూ పులుసు తినాలన్నా బోర్ కొడుతుంది. ఫిష్ ఫ్రై అంటే మరింత ముందుకు వస్తారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫిష్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేస్తారు? ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

శుభ్రం చేసిన చేపలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, ఆయిల్.

ఫిష్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చేపలను పెరుగు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా శుభ్రం చేసిన ముక్కలను ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. ఫిష్ ఫ్రైకి కాబట్టి కాస్త సన్నగానే ముక్కలు కట్ చేయించుకోవాలి. ఇప్పుడు మరో ప్లేట్ తీసుకుని అందులో కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేపలకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. ఆ తర్వాత ఓ అరగంట సేపు పక్కన పెట్టండి.

ఇవి కూడా చదవండి

అరగంట సేపు తర్వాత దోశ పాన్ తీసుకోండి. అది నాన్ స్టిక్ అయితే పర్వాలేదు. లేదంటే మూకిడిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. నాన్ స్టిక్ పాన్‌లో అయితే ముందుగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత చేప ముక్కలను అందులో వేసి మీడియం మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఫిష్ ఫ్రై సిద్ధం.