Kobbari Podi: టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
కొబ్బరితో రుచికరమైన వంటలు, స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ కొబ్బరితో కొబ్బరి పొడి కూడా చేసుకోవచ్చు. ఈ చలికాలానికి ఎంతో బెటర్. ఈ కొబ్బరి పొడిని వేడి వేడి అన్నంలో, బ్రేక్ ఫాస్ట్‌లో వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన గుణాలు ఉంటాయి. ఈ పొడిని ఎంతో తేలిగ్గా కూడా తయారు చేసుకోవచ్చు..
కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. కొబ్బరి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొబ్బరితో ఎన్నో రకాల సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఆరోగ్యానికి ఇంత మంచిదైన కొబ్బరిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరితో రుచికరమైన వంటలు, స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ కొబ్బరితో కొబ్బరి పొడి కూడా చేసుకోవచ్చు. ఈ చలికాలానికి ఎంతో బెటర్. ఈ కొబ్బరి పొడిని వేడి వేడి అన్నంలో, బ్రేక్ ఫాస్ట్‌లో వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన గుణాలు ఉంటాయి. ఈ పొడిని ఎంతో తేలిగ్గా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ కొబ్బరి పొడిని తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కొబ్బరి పొడికి కావాల్సిన పదార్థాలు:
కొబ్బరి, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఆయిల్.
కొబ్బరి పొడి తయారీ విధానం:
ముందుగా కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఓ నిమిషం పాటు కొబ్బరి ముక్కలను వేయించి తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఇందులో ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఒకదాని తర్వాత మరొకటి వేసి వేయించి తీసి చల్లార్చుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు, వేయించిన దినుసులు, వెల్లుల్లి వేసి మెత్తని పొడిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి కలిపి చల్లారేదాకా పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఇందులో పొడి వేసి అంతా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పొడి సిద్ధం. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది.