కరివేపాకుతో షుగర్ కంట్రోల్..! మరెన్నో ప్రయోజనాలు

Jyothi Gadda

22 December 2024

TV9 Telugu

కరివేపాకు వాసన కమ్మగా ఉంటుంది. ఇది ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. అంతేకాదు, కరివేపాకు ఆరోగ్యతో కలిగే ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 

TV9 Telugu

కరివేపాకులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది.

TV9 Telugu

కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కఫం రాకుండా మనల్ని కాపాడుతుంది. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది రక్త నష్టాన్ని తగ్గిస్తుంది.

TV9 Telugu

రక్తంలో చక్కెర స్థాయిలను కరివేపాకు నియంత్రిస్తుంది. డయాబెటిస్ నిర్వహణతో పాటు జీర్ణశయం, ఇతర అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది.

TV9 Telugu

రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, కరివేపాకు నమిలితే కంట్రోల్‌ అవుతుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

TV9 Telugu

కరివేపాకులో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. అలాగే కంటిశుక్లం వంటి వ్యాధుల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది.

TV9 Telugu

కరివేపాకులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కరివేపాకు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. 

TV9 Telugu

కరివేపాకు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ నష్టాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. చర్మంపై కనిపించే సన్నని గీతలు, ముడతలను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.

TV9 Telugu