ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు కొట్టేసినట్లే..

TV9 Telugu

21 December 2024

 కిడ్నీలు.. మన శరీరంలో.. చాలా ముఖ్య భూమిక పోషిస్తాయి. రక్తంలోని వ్యర్థాలను, మనకు అవసరం లేని మినరల్స్‌ను యూరిన్ ద్వారా బయటికి పంపించి, స్వచ్ఛతతో కూడిన రక్తాన్ని బాడీ అంతా సర్కులేట్ చేస్తాయి.

అయితే, మన లైఫ్ స్టైల్, తినే ఫుడ్, మద్యపానం, డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు, వంశపారంపర్య సమస్యలు, కొన్ని రకాల మెడిసన్స్, ఇతర ఆరోగ్య సమస్యలు.. కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి. 

కిడ్నీలు పూర్తిగా పాడయిపోయేవరకు కొన్నిసార్లు లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదరుతోన్న సందర్భంలో ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి.

వాంతులు, వికారంగా ఉండడం.. ఆకలి వేయకపోవడం, అతి మూత్రవిసర్జన లేదా తక్కువ మూత్రవిసర్జన, పాదాలు, చీలమండ వద్ద వాపు.. నిద్రలేమి వంటి సమస్యలు ఉంటాయి.

 మూత్రం వచ్చేటప్పుడు దానితో పాటు రక్తం కూడా వస్తుంది అంటే.. మీ కిడ్నీ పని అయిపోయినట్లే. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లండి. 

డయాబెటిస్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నట్లు రీసెర్చ్‌లు చెబుతున్నాయి. కిడ్నీ వ్యాధులకు మూల కారణం డయాబెటిస్ అని చెప్పవచ్చు. 

 హైబీపీ కూడా కిడ్నీల్లోని రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంటి వ్యాధుల బారిన పడ్డ వారు కూడా ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటూ ఉండాలి.