Allu Arjun: అలా అనడం నన్ను ఎంతో బాధించింది: అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు
Allu Arjun: నేను తెలుగు సినిమా స్థాయి పెంచడానికి సినిమా చేశా.. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్ లో చూస్తేనే తెలుస్తుంది. మూడేళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నావని అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చేయలేదు..
అగ్రహీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడిగింది. ఆరోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎమ్ సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై.. సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్‌రెడ్డి. థియేటర్‌కు రావొద్దని పోలీసులు ముందే చెప్పినా.. సినిమా యూనిట్ వినిపించుకోలేదని.. దరఖాస్తు తిరస్కరించినా థియేటర్‌కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా.. రోడ్ షో చేయడం.. తొక్కిసలాటకు దారితీసిందన్నారు. వెనక్కి వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పూ లేదని చెప్పుకొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు.
నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు:
నేను ఎవరినీ తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని, ప్రభుత్వంతో మేం ఎలాంటి వివాదం కోరుకోవడం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా.. 15రోజులుగా ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ఠపాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారాహిత్యంగా.. థియేటర్‌కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శిస్తానని అన్నారు.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి