Telangana News: ఆదిలాబాద్ జిల్లాలో‌ ఉద్రిక్తత.. ఇండ్లకు నిప్పు‌పెట్టిన ఆందోళన‌కారులు.. అడ్డొచ్చిన పోలీసులపై దాడి

ఓ మైనర్ బాలికను ఓ యువకుడు‌ కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి అత్యాచారం చేయడం తీవ్ర దుమారం రేపింది. మానసిక వికలాంగురాలైన బాలిక ఇంట్లో‌ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, కాలనీవాసులకు పెద్ద ఎత్తున ఆ యువకుడి ఇంటికి చేరుకున్నారు.

Telangana News: ఆదిలాబాద్ జిల్లాలో‌ ఉద్రిక్తత.. ఇండ్లకు నిప్పు‌పెట్టిన ఆందోళన‌కారులు.. అడ్డొచ్చిన పోలీసులపై దాడి
Protesters Set Fire To Houses On Gudihathinur Mandal
Follow us
Naresh Gollana

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 22, 2024 | 6:48 AM

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని‌ ఓ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన‌ ఓ యువకుడు‌ కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి.. అత్యాచారం చేయడం కలకలం రేపింది. మానసిక వికలాంగురాలైన బాలిక ఇంట్లో‌ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన‌ పోలీసులు విచారణ చేపట్టి కాలనీలో‌ సోదాలు నిర్వహించగా పోశెట్టి అనే యువకుడి ఇంటి తలుపులు వేసి ఉండటం.. ఎంతకు ఇంట్లోని వారు తలుపులు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులు తలుపు పగలగొట్టడంతో.. బాలిక యువకుడు పోశెట్టి ఇంట్లో కట్టేసి ఉండటం.. యువకుడు‌ మత్తులో‌ ఉండటంతో వెంటనే పోలీసులు బాలికలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, కాలనీవాసులకు పెద్ద ఎత్తున ఆ యువకుడి ఇంటికి చేరుకున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఆ యువకుడి ఇంటిపై దాడికి దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువకుడిని‌ తమకు అప్పగించాలని‌ కాలనీ‌ వాసులు ఆందోళనకు దిగడం.. యువకుడిని‌ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో అలర్ట్ అయి‌న పోలీసులు యువకుడిని రెస్క్యూ చేసి బయటకు తరలించారు. దీంతో మరింత ఆగ్రహానికి‌ గురైన స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ‌ దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాళ్లు పోలీసులపై పడటంతో ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సై తిరుపతి, మరో ఇద్దరి కానిస్టేబుల్లకు గాయాలయ్యాయి.

పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ చేసి ప్రజలను చెదరగొట్టి నిందితుడిని పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సీఐ, ఎస్ఐలను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ రాళ్ల దాడిలో ఇచ్చోడ ఎస్సై వాహనం ధ్వంసం అయింది. ఇంట్లో బందీగా ఉన్న బాలికను సైతం ఆదిలాబాద్ రిమ్స్‌కు చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ప్రత్యేక బలగాలతో రంగంలోకి దిగారు. అప్పటికే ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు యువకుడు పోశెట్టి ఇంటికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాలనీలో ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి