Vitamin Deficiency: ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

Vitamin Deficiency: ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

Anil kumar poka

|

Updated on: Dec 21, 2024 | 4:48 PM

అన్ని రకాల పోషకాలు సరిగా అందితేనే శరీరంలోని వ్యవస్థలన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి. అందులోనూ కొన్ని రకాల పోషక పదార్థాలు అందకపోతే సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలు వాటిపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం. అలాంటి అత్యంత ముఖ్యమైన వాటిలో ‘విటమిన్ బీ12’ ఒకటి. దీని లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

మాంసం, చేపలు, గుడ్లు, పాలలో విటమిన్ బీ12 ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల శాకాహారుల్లో విటమిన్ బీ12 లోపం ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని లోపం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే.? విటమిన్ బీ 12 లోపం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బీ 12 లోపం ఉన్నప్పుడు మెమరీ లాస్, ఏకాగ్రత కోల్పోవడం, ఎప్పటికప్పుడు మూడ్ మారిపోవడం మూడ్‌ స్వింగ్స్‌ వంటి మానసిక సమస్యలు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు. విటమిన్ బీ12 లోపం వల్ల నోటి సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటిలో అల్సర్లు, నాలుక వాపు, ఎర్రబడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. విటమిన్ బీ 12 లోపం మహిళల్లో వంధ్యత్వంకి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నవారు దీని లోపం తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

విటమిన్ బీ12 లోపం వల్ల నాలుక వాపు, దానిపై ఉండే టేస్ట్ బడ్స్ దెబ్బతినడం, ముక్కులోని వాసన చూడగల భాగం వాపు వల్ల.. రుచి, వాసన చూసే శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బీ12 లోపం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గుతాయి. దీనితో నీరసం, చర్మం కళావిహీనం కావడం, తలనొప్పి వంటి లక్షణాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లోపం ఎక్కువకాలం కొనసాగితే నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నిలకడ కోల్పోవడం వంటి సమస్యలు కూడా బీ12 లోపం వల్ల వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గందరగోళం, మతిమరపు వంటి ఇబ్బందులూ వస్తాయని హెచ్చరిస్తున్నారు. బీ12 లోపం వల్ల అంగ స్తంభన సమస్య, వంధ్యత్వం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని… విటమిన్ సరిపడా అందేలా చూసుకుంటే, సమస్యలు తగ్గిపోతాయని వివరిస్తున్నారు. విటమిన్ బీ12 లోపం వల్ల రావొచ్చని పేర్కొన్న లక్షణాలు ఇతర వ్యాధులు, ఆరోగ్య సమస్యలతోనూ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తగిన వైద్య పరీక్షలు చేయించుకుంటే అసలు సమస్య ఏమిటో తెలుస్తుందని… తగిన మందులు వాడితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం, మందులు వాడటం అనేది వ్యక్తుల శారీరక స్థితిని బట్టి ఉంటుందని… వైద్యుల సూచనల మేరకే వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.