AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Aravind: నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది.. అల్లు అరవింద్ ఆవేదన..

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని అన్నారు.

Allu Aravind: నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది.. అల్లు అరవింద్ ఆవేదన..
Allu Aravind, Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2024 | 6:47 AM

Share

సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, టాలీవుడ్ పై తీవ్ర స్తాయిలో ఆరోపణలు చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని.. ఆ రోజు థియేటర్లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని.. వచ్చి తనకు ఏం చెప్పలేదని.. థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. ఇక బన్నీ మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసినా.. ఫ్యాన్స్ తనను ఎలా రిసీవ్ చేసుకున్నారనే చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కు లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి.. రికార్డ్స్ క్రియేట్ చేసిన నా కొడుకు రెండు వారాలుగా ఈ గార్డెన్ లోనే ఓ మూల కూర్చుంటున్నాడు. నేను వెళ్లి అడిగాను చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. వెళ్లు కనీసం బయటకు అయినా వెళ్లు.. ఇక్కడే ఇలా ఎందుకు ఉంటావు అని చెప్పాను. కానీ తాను ఎక్కడికి వెళ్లను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావడంతో చాలా బాధపడుతున్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈరోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావడంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి ఇలా వచ్చాము” అని అన్నారు.

న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంత ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. మూడు తరాలుగా మా కుటుంబం గురించి తెలుసు. ఇలా వ్యవహరించామా ? మీ కళ్ల నుంచి తప్పించుకుని ఇన్నేళ్లు ఉండగలమా ? మాపై అసత్య ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.