Prabhas: మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల్లో ప్రభాస్ టాప్.. తర్వాత ఆ తెలుగు స్టార్ హీరోయిన్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కల్కి సినిమాతో థియేటర్లలోకి వచ్చిన డార్లింగ్.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
ప్రముఖ మీడియా ఆర్మాక్స్ సంస్థ ప్రతినెలా దేశంలోని సెలబ్రెటీలపై సర్వే నిర్వహించి ఓ జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే మోస్ట్ పాపులర్, టాప్ పోజిషన్ లోని వారి జాబితాలను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా నవంబర్ నెలకుగానూ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నవంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇక హీరోయిన్లలలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు.. కథానాయికల జాబితాలో సమంత వరుసగా మూడోసారి (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) నెలలో ఫస్ట్ ప్లేస్ లో నిలవడం విశేషం. ఇక ప్రభాస్ సైతం వరుసగా రెండోసారి (అక్టోబర్, నవంబర్) నిలిచారు. ఇక నవంబర్ నెలకు ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో ప్రభాస్ తర్వాతి స్థానంలో విజయ్ దళపతి నిలిచారు.
వీరిద్దరి తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేష్ బాబు, సూర్య , రామ్ చరణ్, అక్షయ్ కుమార్ నిలిచారు. అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో సమంత నిలిచింది. ఇప్పటికే మూడు సార్లు నంబర్ వన్ స్థానంలో నిలిచి హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించింది సామ్. ఆ తర్వాత అలియ భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకోన్, త్రిష, కాజల్, రష్మిక మందన్నా, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న సామ్.. ఇప్పుడు తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సమంత.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.