Gold Rate: వచ్చే ఏడాది కూడా బంగారం ధర భారీగా పెరగబోతోందా? ఇదిగో డీటేల్స్..
వచ్చే ఏడాది కూడా బంగారం ధర భారీగా పెరగబోతోందా?.. 2025లో రూ.1.37లక్షలు దాటిన గోల్డ్ రేట్... వచ్చే ఏడాది.. లక్షన్నర దాటడం గ్యారెంటీనా?.. 2026 పసిడి ధరలపై గోల్డ్‌మన్ శాక్స్ ఏం చెప్తోంది?... పూర్తి వివరాలు ఈ కథనంలో ... ..

బంగారం ధర రోజురోజుకీ భయపెడుతోంది. గోల్డ్ రేట్ అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతోంది. ప్రధానంగా.. 2025లో బంగారం ధరలు భగభగ మండిపోయాయి. కాస్త హెచ్చుతగ్గులు ఉన్నా ఏడాది మొత్తంలో పసిడి రేటు పైపైకి దూసుకుపోతూనే ఉంది. ఈ ఏడాది ఒకనొకదశలో లక్షా 37వేల రూపాయలు దాటేసింది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా పసిడి ధరలు ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే 15-30శాతం వరకు పెరగొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. 2026 చివరికి 10 గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరుతుందని.. లక్షా 60వేలు కూడా దాటే చాన్స్ ఉందని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ చెప్తోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా టారిఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడుల పెరుగుదల లాంటి కారణాలతో బంగారం ధరలు పెరగనున్నాయి. వాస్తవానికి.. గోల్డ్ రేట్ ఈ ఏడాది 70శాతం పైగానే పెరిగింది. ఈ రేంజ్‌లో 1979లో 120 శాతం పెరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2024 డిసెంబర్ 31న పది గ్రాముల బంగారం 78వేల 950రూపాయలు ఉంటే 2025 ఏప్రిల్ 22న లక్ష రూపాయలు దాటి రికార్డ్‌లు సృష్టించింది. ప్రస్తుతం 10గ్రాముల బంగారం ధర లక్షా 36వేల రూపాయల పైనే ఉంది. అలాగే.. 2013లో దాదాపు 30వేలు ఉంటే.. 2024 జనవరిలో 60వేలకు చేరింది. అంటే బంగారం ధర రెండింతలు కావడానికి 11ఏళ్లు పట్టింది. కానీ.. 2024 తర్వాత మాత్రం గోల్డ్ రేట్ ఓ రేంజ్‌లో పెరుగుతూ వస్తోంది. 2024 జనవరి తర్వాత 22నెలలకే బంగారం ధర డబుల్ అవడం షాకిచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌కే లక్షా 20వేలను క్రాస్ చేసి రికార్డ్‌లు బద్దలు కొట్టింది. ఈ క్రమంలోనే.. వచ్చే ఏడాది కూడా బంగారం ధరల భగభగలు తప్పవంటోంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




