- Telugu News Photo Gallery Cinema photos Actress Anaswara Rajan Shares Bitter Experience In School Days When She Is Child Artist
Actress : దారుణంగా అవమానించారు.. ఎన్నోసార్లు ఒంటరిగా ఏడ్చాను.. యంగ్ హీరోయిన్ కామెంట్స్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ ఈ హీరోయిన్. ఒక్క సినిమా సైతం రిలీజ్ కాకుండానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అందం, అభినయంతో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన కెరీర్ తొలినాళ్లల్లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.
Updated on: Dec 21, 2025 | 5:13 PM

తెలుగులో కేవలం ఒక్క సినిమానే చేసింది. ఇప్పుడు అదే మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

అనస్వర రాజన్... ఇప్పుడు తెలుగు అడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ. మలయాళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకుంది. పాతిక సినిమాలకు పైగానే చేసి తనదైన ముద్ర వేసింది ఈ అమ్మడు.

ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.

ఈ క్రమంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టి మంచి ప్రశంసలు అందుకుంది. కానీ చిన్నప్పుడు తనను స్కూల్లో టీచర్స్ అవమానించారని తెలిపింది. స్కూల్లో ఎవరు పలకరించేవారని తెలిపింది.

టీచర్లే తనతో మాట్లాడొద్దని వాళ్ల తల్లిదండ్రులతో చెప్పించేవాళ్లని.. మార్కులు తక్కువగా వస్తే సినిమాలు చేసుకోవచ్చు బాధపడకు అని హేళన చేసేవారని.. ఎంతగా అవమానించారో.. అదే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడేలా చేసిందని చెప్పుకొచ్చింది.




