సమంత- రాజ్‌ల ప్రేమ కథ.. ఇలా మొదలైంది

21 December 2025

Pic credit - Instagram

Phani Ch

ఈ నెల  1వ తేదీన  సమంత- రాజ్ ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే సమంత, రాజ్ ఎలా కలిశారు ఎలా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు అనేది ఇప్పుడు తెల్సుకుందాం.

మొట్ట మొదట 2021 జూన్‌లో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో పనిచేస్తున్నప్పుడు సమంత, రాజ్ కలుసుకున్నారు.

అయితే తరువాత సిటాడెల్: హనీ బన్నీలో మళ్ళీ కలిసి పని చేయగా అదే సమయంలో సమంత నిర్మాతగా  అరంగేట్రం చేసిన శుభమ్‌ మూవీకి రాజ్ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేసాడు రాజ్.

అయితే వారి ప్రొఫెషనల్‌ బాండ్‌ క్రమంగా పర్సనల్‌ రిలేషన్‌గా మారగా  వారిద్దరూ తమ రిలేషన్‌ని చాలా కాలం పాటు పబ్లిక్‌కి అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

ఇది ఇలా ఉంటే హైదరాబాద్‌లో సామ్ ఇంట్లో దిగిన తన పర్సనల్ పిక్స్  రాజ్ కనిపించాడు. అంతే కాకుండా  సమంత సన్నిహితులతో దీపావళి వంటి  పండుగలను సెలబ్రేట్‌ చేసుకోవడం తో  ఊహాగానాలు ఇంకా పెరిగాయి

ఆ తరువాత  ఈ జంట కలిసి వెకేషన్స్‌కి వెళ్లడం, క్లోజ్ సెల్ఫీలు షేర్‌ చేసుకోవడం తో ఫ్యాన్స్ వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. రాజ్ సమంత జీవితంలోని అనేక కీ మూమెంట్స్‌లో భాగమయ్యాడు.

ఛాలెజింగ్‌ టైమ్స్‌లో తనకు సపోర్ట్‌గా ఉన్నాడని, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు, సిటాడెల్ వంటి ప్రాజెక్టుల సమయంలో చాలా హెల్ప్‌ చేశాడని తెలిపింది.