హైదరాబాద్లో ఓ డాక్టర్ రూ.14.6 కోట్లు భారీ సైబర్ మోసానికి గురయ్యారు. కాంబోడియా నుండి అమ్మాయిల ఫోటోలతో పరిచయం చేసుకుని, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో మోసగాళ్లు వల వేశారు. డాక్టర్ తన ఇంటిని కూడా అమ్మి డబ్బు పెట్టుబడిగా పెట్టారు. ఈ కేసులో పోలీసులు ఖమ్మం నుండి నలుగురిని అరెస్టు చేశారు.