ఉదయం కాఫీ తాగనిదే చాలా మందికి రోజు మొదలవ్వదు. అయితే, కాఫీతో బీపీ పెరుగుతుందనే అపోహలపై నిపుణులు స్పష్టతనిచ్చారు. కాఫీలోని కెఫిన్ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుందని, రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల ఇది జరుగుతుందని వివరించారు. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా పరిమితంగా కాఫీ తీసుకోవచ్చు, అయితే చక్కెర, పాలు తగ్గించాలని సూచిస్తున్నారు.