21 December 2025

సైలెంట్ అయిన అంజలి.. ముద్దుగుమ్మ ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అచ్చ తెలుగమ్మాయి అంజలి. నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే.. సహజ నటనతో కట్టిపడేస్తుంది. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీ సినీరంగంలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. 

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకీ మరదలు సీత పాత్రతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. దీంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి.

తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు.. సినిమాలతోపాటు అటు వెబ్ సిరీస్ సైతం చేసి నటిగా అలరించింది.

తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఒక్కో సినిమాకు తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుందట.

నివేదికల ప్రకారం ఈ బ్యూటీ ఆస్తులు రూ.150 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. అలాగే హైదరాబాద్, చెన్నైలో ఆస్తులు ఉన్నాయట.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే.. విభిన్న కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. సహజ సౌందర్యం.. నటనతో కట్టిపడేస్తుంది అంజలి.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న అంజలి.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ, సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది.