21 December 2025

మిల్కీ బ్యూటీ ఫిట్‌నెస్ సీక్రెట్.. 36 ఏళ్ల వయసులో తగ్గని అందం..

Rajitha Chanti

Pic credit - Instagram

మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు నేడు (డిసెంబర్ 21). ఈ సందర్భంగా ఆమె ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్స్ గురించి నెట్టింట వైరలవుతున్నాయి.

36 ఏళ్ల వయసులో ఏమాత్రం తగ్గని అందం, ఫిట్‌నెస్ తో ఆశ్చర్యపరుస్తుంది తమన్నా. ఫిజిక్, టోన్డ్ బాడీ చూస్తే వయసు నమ్మశక్యంగా లేదు.

ఈ అమ్మడు తన లీన్, హెల్తీ ఫిట్‌నెస్ కోసం బ్యాలెన్స్డ్, న్యూట్రిషియన్ డైట్ తీసుకుంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఫిట్‌నెస్ విషయాలు చెప్పింది.

బరువు పెరగకుండా ఉండేందుకు.. శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుందట. అలాగే బ్రేక్ ఫాస్ట్ పోహా చేస్తుందట. 

ఫైబర్ రిచ్, ఫ్లాట్ రైస్ తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుందని.. రోజంతా శక్తివంతంగా ఉంచుతుందట.

ఈ ఆహారం తన బరువు నియంత్రణ ఉండేందుకు సహయపడుతుందని తెలిపింది. ఎక్కువ పదార్థాలు లేకుండా పోహా చేసుకుంటానని తెలిపింది.

బరువు పెరగకుండా తగ్గాలనుకున్నప్పుడు పోహాతోపాటు మొలకలను సైతం తీసుకుంటానని.. ఈ రెండు వెయిట్ లాస్ కోసం సహయపడతాయట.

విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తో ఉన్న మొలకలతో ఉండే పోహా జీర్ణక్రియకు సహయపడుతుందని చెప్పుకొచ్చింది.