Expire Chicken: చికెన్ ను ఎంత కాలం నిల్వ చేయాలి? ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
గత కొంత కాలంగా రెస్టారెంట్స్ లో ఆహారం ఆరోగ్యకరమైనదేనా అనే సందేహం కలుగుతోంది. అనేక రెస్టారెంట్స్ లో గడవు ముగిసిన ఆహారం, అపరిశుభ్రమైన ఆహారం గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా తెలంగాణ ఆహార, భద్రతా శాఖ సిబ్బంది అనేక రెస్టారెంట్ల నుంచి గడువు ముగిసిన ముడి చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటువంటి పరిస్థితిలో గడువు ముగిసిన చికెన్ తినడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే చికెన్ ఎంతకాలం నిల్వ ఉంచాలి కూడా తెలుసుకుందాం..
రోజూ ఇంట్లోనే ఒకేరమైన ఆహారమా అంటూ చాలా మంది అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఎందుకంటే సాధారణంగా రెస్టారెంట్లలోని ఫుడ్ రుచికరంగా ఉంటుందని.. ఫుడ్ ఎక్స్‌పైరీ లేదా పరిశుభ్రతకు సంబంధించిన సమస్య ఉండదని నమ్మకం. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు గురించి తెలిస్తే ఎవరైనా రెస్టారెంట్ కు వెళ్ళాలంటే ఆలోచిస్తారు. వాస్తవానికి తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని రెస్టారెంట్లలో 10 కిలోల గడువు ముగిసిన ముడి చికెన్, లేబుల్ లేని నూడుల్స్ కనుగొన్నారు.
ఏదైనా గడువు ముగిసిన ఆహారం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో చాలా మంది ప్రజలు చికెన్ తినడానికి ఇష్టపడతారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (2019-21) నివేదిక ప్రకారం ఒక వారంలో 57.3 శాతం పురుషులు, 45.1 శాతం మహిళలు చికెన్ లేదా ఇతర నాన్-వెజ్ ఐటమ్స్ తింటారు. అటువంటి పరిస్థితిలో చికెన్ తినే వ్యక్తులు గడువు ముగిసిన చికెన్ తినడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం ముఖ్యం. అయితే ముందుగా చికెన్‌ని ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చో తెలుసుకుందాం.
చికెన్ ఎన్ని రోజులు తాజాగా ఉంటుందంటే
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ముడి చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో సుమారు 1-2 రోజులు ఉంచవచ్చు. అదేవిధంగా ఉడికించిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో సుమారు 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి మందగిస్తుంది.
చికెన్ పాడైపోయిందని ఎలా తెలుస్తుందంటే
చికెన్ చెడిపోయి ఉంటే దాని రంగులో మార్పు కనిపిస్తుందని ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ పంకజ్ వర్మ చెబుతున్నారు. వాసనతో పాటు, ఆకృతి, రుచిలో కూడా తేడా ఉంటుంది. చికెన్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే ఆ చికెన్ చెడిపోయిందని.. తినడానికి పనికి రాదని అర్ధం.
ఏ వ్యాధులు రావచ్చంటే
ఫుడ్ పాయిజనింగ్: గడువు ముగిసిన చికెన్‌లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు. అటువంటి పరిస్థితిలో గడువు ముగిసిన చికెన్ తినడం వల్ల అతిసారం, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.
రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం: గడువు ముగిసిన చికెన్‌లో బ్యాక్టీరియా భారీ సంఖ్యలో పెరుగుతుంది. ఇది తిన్న తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియాతో పోరాడటానికి చాలా కష్టపడాలి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.
మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం: గడువు ముగిసిన చికెన్‌లో ఉన్న టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశిస్తే అది మూత్రపిండాలు, కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ విష పదార్థాలను ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలు, కాలేయం పని చేస్తాయి. అటువంటి పరిస్థితిలో చెడు చికెన్ మూత్రపిండాలు, కాలేయ వ్యాధులకు కారణమవుతుంది.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వంటగది పాత్రలను నిల్వ చేయడానికి ముందు, తర్వాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు బాగా కడగాలి. అదనంగా బాక్టీరియా పెరుగుదలను నివారించడానికి సింక్‌ను వెంటనే వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేయండి. అదే సమయంలో వండిన చికెన్ మిగిలి ఉంటే.. దానిని 1 నుంచి 2 గంటలు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)