Fixed Deposits: ఎఫ్‌డీలను ముందుగా తీసుకుంటే ఇంత నష్టమా.. బ్యాంకులు విధించే చార్జీలు ఇవే..!

సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి మార్గాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) ముందు వరుసలో ఉంటాయి. వివిధ బ్యాంకులు అందించే ఎఫ్ డీ పథకాలను అందరూ విశ్వసిస్తారు. గ్రామీణుల నుంచి నగర ప్రజల వరకూ వీటిలో డబ్బులను పెట్టుబడి పెడతారు. పిల్లల పుట్టగానే వారి మీద డిపాజిట్ చేస్తారు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత చదువులు, పెళ్లిళ్ల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు.

Fixed Deposits: ఎఫ్‌డీలను ముందుగా తీసుకుంటే ఇంత నష్టమా.. బ్యాంకులు విధించే చార్జీలు ఇవే..!
Fixed Deposits
Follow us
Srinu

|

Updated on: Nov 26, 2024 | 3:39 PM

మన సమాజంలో ఎఫ్ డీలకు అంతటి ప్రాధాన్యం ఉంది. నిర్ణీత సమయానికి వడ్డీతో కలిసి పెట్టుబడిని తిరిగి తీసుకునే అవకాశం ఉండటం, మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకపోవడమే ఎఫ్ డీల మనుగడకు ప్రధాన కారణం. అయితే నిర్ణీత కాలవ్యవధి కంటే ముందుగానే ఎఫ్ డీలో డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది. బ్యాంకులు ఏమైనా చార్జీలు వసూలు చేస్తాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అన్ని బ్యాంకుల్లో ఎఫ్ డీ పథకాలు అమలవుతున్నాయి. ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఆయా బ్యాంకులు తమ నిబంధనల మేరకు వడ్డీరేట్లను అమలు చేస్తాయి. ఇది బ్యాంకుల వారీగా మారుతుంది.

సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీరేట్లు అమలవుతాయి. కాబట్టి సురక్షితమైన, నమ్మకమైన, వడ్డీ ఎక్కువ ఇచ్చే బ్యాంకును ఎంపిక చేసుకుని డబ్బులను డిపాజిట్ చేయాలి. ఎఫ్ డీకి నిర్ణీత కాలవ్యవధి ముగిసిన తర్వాత వడ్డీతో కలిసి అసలును చేతికిచ్చేస్తారు. కానీ అత్యవసర పరిస్థితులు, అవసరాలు తదితర వాటి కోసం ముందుగానే ఎఫ్ డీని రద్దు చేయాలనుకుంటే బ్యాంకులు వసూలు చేసే చార్జీలు ఈ కింద తెలిపిన విధంగా ఉంటాయి. మెచ్యురిటీ తేదీ కన్నా ముందుగానే ఎఫ్ డీని రద్దు చేసుకుంటే దాన్ని ముందస్తు ఉపసంహరణ అంటారు. దీనికి బ్యాంకులు సాధారణంగా పెనాల్టీని విధిస్తాయి. ఇది చివరి వడ్డీ చెల్లింపు నుంచి కట్ చేస్తాయి. లేకపోతే పెట్టుబడిని తిరిగి ఇచ్చేటప్పుడు తీసి వేస్తాయి.

ఇవి కూడా చదవండి
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఎఫ్ డీలను ముందస్తుగా ఉపసంహరించుకుంటే రూ.5 లక్షల లోపు డిపాజిట్లపై 0.50 శాతం పెనాల్టీ విధిస్తారు. అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై ఒక శాతం వసూలు చేస్తారు. ఇక ఏడు రోజుల లోపు ఉపసంహరించుకున్న డిపాజిట్లపై వడ్డీ చెల్లించరు.
  • ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీలో ఎఫ్ డీల ఉపసంహరణపై పెనాల్టీ ఒక శాతం కన్నా తక్కువగా ఉంటుంది. ఆ సొమ్ము బ్యాంకులో ఉన్న కాలం ఆధారంగా ఎంత చార్జీ వసూలు చేయాలో నిర్ణయం తీసుకుంటారు.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక శాతం జరిమానా విధిస్తారు. చెల్లించాల్సిన వడ్డీ రేటు మైనస్ ఒక శాతం జరిమానాలో ఏది తక్కువైతే అది అమలు చేస్తారు.
  • ఐసీఐసీఐ బ్యాంకులో ఎఫ్ డీల అకాల ఉపసంహరణకు 0.50 నుంచి ఒక శాతం చార్జీ వసూలు చేస్తారు. బ్యాంకులో ఉన్న డిపాజిట్ కాలవ్యవధిని బట్టి దాన్ని నిర్ణయిస్తారు.
  • బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఎఫ్ డీలను 12 నెలల తర్వాత ఉపసంహరించుకుంటే ఎలాంటి జరిమానా ఉండదు. అంతకంటే ముందుగా రద్దు చేసుకుంటే 0.50 శాతం వసూలు చేస్తారు.
  • కెనరా బ్యాంకులో డిపాజిట్ మొత్తం, ఉపసంహరణ కాలవ్యవధిని బట్టి 0.50 నుంచి ఒక శాతం చార్జీ కట్టించుకుంటారు.
  • ఎస్ బ్యాంకులో అకాల ఉప సంహరణకు ఒక శాతం పెనాల్టీ విధిస్తారు. డిపాజిట్ సమయంలో వర్తించే వడ్డీరేటు, పెనాల్టీలో ఏది తక్కువ ఉంటే అది అమలు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి