AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP Investment: చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో రాబడి.. ఆ ఎస్ఐపీ స్కీమ్‌లో సూపర్ ఇన్‌కమ్

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ( ఎస్ఐపీ) అనేది ఇటీవల కాలంలో పెట్టుబడిదారులను అమితంగా ఆకర్షిస్తుంది. రూ.100 నుంచి ఎస్ఐపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఎస్ఐపీ పెట్టుబడిదారులకు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని అలవాటు చేస్తుంది. తక్కువ పెట్టుబడితో పెద్ద మొత్తంలో ఆర్థిక ఆస్తుల సేకరణుకు అవకాశం ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అధిక రాబడినిస్తున్న ఎస్‌బీఐ ఎస్ఐపీ గురించి తెలుసుకుందాం.

SIP Investment: చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో రాబడి.. ఆ ఎస్ఐపీ స్కీమ్‌లో సూపర్ ఇన్‌కమ్
Nikhil
|

Updated on: Nov 26, 2024 | 3:50 PM

Share

ఎస్‌బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ పెట్టుబడిదారుడు కేవలం రూ.2,500 నెలవారీ ఎస్ఐపీను ప్రారంభించింది. ప్రారంభంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడి విలువ దాదాపు రూ. 1.18 కోట్లుగా ఉంటుంది. 25 ఏళ్ల వ్యవధిలో రూ.7.50 లక్షలు డిపాజిట్ కాగా మిగిలిన రూ.1.10 కోట్లు లాభాలుగా జమ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది హెల్త్ కేర్ పరిశ్రమలో అత్యుత్తమంగా పనిచేసే మ్యూచువల్ ఫండ్లలో ఒకటి. ఈ ఫండ్ జూలై 1999లో స్థాపించారు.

ఎస్‌బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ మాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుపిన్ లిమిటెడ్, డివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్, పాలీ మెడిక్యూర్ లిమిటెడ్ వంటి కంపెనీలను కలిగి ఉంది. ఎస్‌బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ 18% కంటే ఎక్కువ వార్షిక రాబడితో సంవత్సరాల్లో అద్భుతమైన పనితీరును కనబరిచింది. గతేడాది వార్షిక రాబడి 37 శాతం మార్కును తాకింది. ఈ ఫండ్ ప్రధానంగా హెల్త్ కేర్ సెక్టార్‌పై దృష్టి పెడుతుంది. దాని మొత్తం పెట్టుబడిలో 93.23% ఉంటుంది 

ఎస్‌బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ ప్రమాదకర పెట్టుబడి ఎంపికగా కొంత మంది నిపుణులు భావిస్తున్నారు. ఎక్కువ అస్థిరతతో కూడా ఎక్కువ రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు ఇది సరైనదని వివరిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణతో పాటు ఈ ఫండ్ 3.50 శాతం కెమికల్ మెటీరియల్స్‌ను కూడా కేటాయిస్తుంది. ఈ ఫండ్‌కు సంబంధించిన దీర్ఘకాలిక విజయం ఆశాజనక పరిశ్రమలను ఎంచుకోవడంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికకు కట్టుబడి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి